ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

23న చాగల్నాడు కాలువ నీరు విడుదల

ABN, Publish Date - Jul 19 , 2025 | 01:23 AM

గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన చాగల్నా డు ఎత్తిపోతల పథకంలోని మోటార్లు, పైపులై న్లకు రానున్న ఏడాదిలో మరమ్మతులు చేపట్ట నున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొ న్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు.

ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే బత్తుల
  • మోటార్లకు రానున్న ఏడాదిలో మరమ్మతులు

  • ఇరిగేషన్‌ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన చాగల్నా డు ఎత్తిపోతల పథకంలోని మోటార్లు, పైపులై న్లకు రానున్న ఏడాదిలో మరమ్మతులు చేపట్ట నున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొ న్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మెట్ట ప్రాంత రైతాంగానికి చాగల్నా డు ద్వారా సాగు, తాగు నీరందించి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడే ఈ పథకం వైసీపీ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గు రైంద న్నారు. దీంతో మోటార్లు, పైపులైన్లు పూర్తిగా పాడై సాగు నీటిని విడుదల కష్టం గా మారిందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23న చాగల్నాడు కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది జూలై 29న నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది గతం కంటే వారం రోజులు ముం దుగానే విడుదల చేస్తున్నామన్నారు. కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టామన్నారు. సమావే శంలో ఇరిగేషన్‌ అఽధికారులు ఏఈ సత్యనారా యణ, రిటైర్డ్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 01:23 AM