ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:07 AM

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్‌ పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

దివాన్‌చెరువులో వృద్ధురాలికి ఇంటి వద్ద రేషన్‌ అందజేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

కొవ్వూరు/రాజానగరం, జూన్‌ 3 (ఆం ధ్రజ్యోతి) : వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్‌ పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం లాలాచెరువు, దివాన్‌చెరువు ప్రాంతాల్లో మంగళవారం పలు వురికి ఇంటి వద్దనే రేషన్‌ అందించి సమ స్యలు తెలుసుకుని మాట్లాడారు. జిల్లాలోని 19 మండలాల్లో 65,863 మంది 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌రీడెడ్‌ రేషన్‌కార్డుదారులకు ఇంటివద్దనే రేషన్‌ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 65 ఏళ్లు దాటిన లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో రేషన్‌ డీలర్లు సరుకులు పంపిణీచేయడం జరుగుతుందన్నా రు. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ వరకు రేషన్‌ సరుకులు పంపిణీ చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 871 చౌకధరల దుకాణాల ఆధ్వర్యంలో 5,64,994 మం ది కార్డుదారులు ఉన్నారన్నారు.రాజమహేంద్రవరం డివిజన్‌లో 36,879, కొవ్వూరు డివిజన్‌లో 28,984 మంది కలిపి 65,863 మం ది వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌రీడెడ్‌ విభాగాలకు చెందిన వారు ఉన్నారన్నారు.కొవ్వూరులో రేషన్‌ పంపిణీని జేసీ ఎస్‌.చిన్నరాముడు,ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలించారు.

Updated Date - Jun 04 , 2025 | 01:07 AM