రైస్.. రైట్..
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:24 AM
జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.5,27,077 విలువ చేసే 11 టన్నుల 355 కిలోల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు జూలై 8న స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమబియ్యం వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఆగని రేషన్ మాఫియా
జిల్లాలో పలుచోట్ల బియ్యం అక్రమ నిల్వలు
పట్టుబడుతున్నా.. పట్టు వదలని అక్రమార్కులు
కేసులు నమోదవుతున్నా అదే పంథా
గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తెరవెనుక వ్యాపారం
జిల్లాలో గతేడాది డిసెంబరునుంచి పట్టుబడిన రేషన్ బియ్యం 47,148 టన్నులు
వాటి విలువ రూ.220కోట్లు.. 85కేసులు నమోదు
(కాకినాడ ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.5,27,077 విలువ చేసే 11 టన్నుల 355 కిలోల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు జూలై 8న స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమబియ్యం వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కాకినాడ రూరల్ మండలం వలసపాకలు, వాకలపూడిలో 5.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జూలై 20న ఆదివారం రాత్రి సివిల్ సప్లయీస్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ తరలింపునకు సిద్ధంగా ఉన్న 14 రైస్ బస్తాలను స్వాధీనం చేసుకుని బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై 6ఏ, క్రిమినల్ కేసు నమోదు చేశారు.
రెండువారాల వ్యవధిలో కాకినాడ రూరల్ ని యోజకవర్గంలో పలుచోట్ల రేషన్‌బియ్యం పట్టు బడ్డాయి. ఇక్కడేకాదు.. పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట ఇలా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు 6ఏ తోపాటు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నా. రేషన్‌మాఫియా తగ్గడం లేదు.
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ రేషన్ మాఫియాకు చెక్‌పెట్టామని చెప్తున్నారు. బియ్యం అక్రమ ఎగుమతిదారులపై పీడీ యాక్ట్ తీసుకొచ్చామని, క్రిమినల్ కేసులు నమో దు చేస్తున్నామంటున్నారు. 6ఏతోపా టు భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)కింద కేసులు నమోదుకు వె నుకాడబోమని హెచ్చరిస్తూనే ఉన్నా రు. అయినా రేషన్‌మాఫియా లెక్కచేయడంలేదు.కేసులు కడుతున్నా, పదే పదే పట్టుబడుతున్నా.. కొందరు బరి తెగించి వ్యాపారం సాగిస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీహయాంలో కాకినాడ పోర్టు ఆ ధారంగా పెద్దఎత్తున రేషన్‌బియ్యం అక్రమంగా తరలిపోయింది. కాకినాడ వైసీపీ కీలక నేత కు టుంబం అండ దండలతో బియ్యం అక్రమ సరఫరాదారులు చెలరేగిపోయారు. రేషన్‌బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంలా మార్చి ఆఫ్రికన్ వంటి ఇతర దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకునేవారు.కాకినాడ, పిఠాపురం,పెద్దాపురం ఇలా పలుచోట్ల అక్రమవ్యాపారులు తమ స్థావ రాలు ఏర్పాటు చేసుకుని బియ్యాన్ని సేకరించి నిల్వచేసేవారు. ప్రభుత్వం కిలో రూ.40కి కొని పేదలకు ఉచితంగా ఇస్తుంటే.. రేషన్‌మాఫియా కిలో రూ.10-రూ.15 ఇచ్చి కొనుగోలు చేసేది.
కట్టడి చేసినా..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెం టనే కాకినాడ పోర్టులో వైసీపీ నేత కుటుంబం చేపడుతున్న బియ్యం రవాణా వ్యాపారంపై దృ ష్టిపెట్టింది. బియ్యం సేకరణ, నిల్వ, ఎగుమతితో పాటు ఇందులో ఎవరెవరున్నారు.. వంటి వివరాలను సేకరించింది. తర్వాత వరుసగా పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేరుగా పోర్టును పరిశీలించడం, బియ్యం ఎగుమతులపై ఆరాతీయడంతో నేషనల్ మీడియా కూడా కాకినాడ పోర్టుపైనే దృష్టి పెట్టింది. బియ్యం రవాణాకు అడ్డుకట్ట పడాల్సిందేనని వారు చెప్పడంతో కలెక్టర్, ఎస్పీ, సివిల్ సప్లయీస్, పోర్టు అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అక్కడ లారీలను పూర్తిగా పరిశీలించాకే పోర్టులోకి ఎగుమతికి అనుమతించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఎంత తీవ్రంగా హెచ్చరించినా..
డిప్యూటీసీఎం పవన్‌కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల, ఇతర ప్రభుత్వ పెద్దలు బియ్యం అక్రమ రవాణాను సహించబోమని, క్రి మినల్ కేసులు, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించినా.. రేషన్‌బియ్యం పట్టుబడి వాహనాలు సీజ్‌చేస్తున్నా.. కేసులు నమోదు చేస్తున్నా మాఫియాకు అడ్డుకట్టపడడంలేదు. వైసీపీ హ యాంలో రైస్ మాఫియాను నడిపించిన వారే కూటమి ప్రభుత్వంలోను నడిపిస్తున్నారని ప ట్టుబడిన నిర్వాహకులను బట్టి తెలుస్తోంది.
రూటు మార్చిన మాఫియా..
కాకినాడ యాంకరేజ్ పోర్టులో బొంబాయి కా టావద్ద, శక్తి గేట్‌వద్ద రెండు చెక్‌పోస్టులు ఏర్పా టు చేయడం, వైజాగ్ పోర్టులో కూడా కాకినాడ తరహా చెక్‌పోస్టుల ఏర్పాటుకు అక్కడ పౌరసరఫరాలశాఖ ఏర్పాటుకు సిద్ధం కావడంతో రేషన్‌మాఫియా రూటు మారుస్తున్నట్టు తెలుస్తోం ది. ఒడిశా, గుజరాత్ పోర్టుల నుంచి బియ్యం ఎగుమతులు చేసేందుకు వారు దారులు వెతుక్కుంటున్నారని సమాచారం.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
జిల్లాలోని 21 మండలాలకు సివిల్‌సప్లయీస్ డిప్యూటీతహసీల్దార్లు 11మంది మాత్రమే ఉన్నా రు. వీరే పక్క మండలాల విధులు నిర్వర్తిస్తున్నారు. రేషన్‌పంపిణీ విధానాన్ని ప్రతినెలా వీరే పరిశీలించాలి. ఉన్నసిబ్బంది ఆ విధులు చేపట్ట డం కష్టమవుతుండడంతో రేషన్‌మాఫియాను పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి. 2024, డిసెంబర్ నుంచి ఈఏడాది ఇప్పటివరకు.. 47,148 టన్ను ల బియ్యంనిల్వలను అధికారులు పట్టుకున్నారు. వాటివిలువ రూ.220కోట్లు, జిల్లాలో ఇప్పటి వరకు 85కేసులు నమోదుకాగా, కాకినాడ సిటీ, రూరల్, పోర్టుల్లోనే 21 కేసులుండడం విశేషం.
సన్నబియ్యం సరఫరా చేస్తే..
ప్రస్తుతం రేషన్‌దుకాణాల ద్వారా అందజే స్తున్న బియ్యాన్ని లబ్ధిదారులు ఎవరూ తినడం లేదు. అదే ఈ బియ్యం అక్రమ రవాణాదారులకు ఆదాయంగా మారింది. రేషన్‌షా పుల ద్వారా సన్నబియ్యం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తొలుత స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకానికి, అం గన్‌వాడీకేంద్రాలకు సన్నబియ్యం అందజేస్తా మని చెప్పి.. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. చెప్పినట్టుగానే సరఫరా చేస్తోంది. రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తే.. ఎవ రూ వాటిని విక్రయించుకునే అవకాశం ఉం డదు.అక్రమరవాణాకు అడ్డుకట్ట పడుతుంది.
6ఏ కేసులతో భయం లేక..
రేషన్‌బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడి న వారిపై సివిల్‌సప్లయీస్ అధికారులు నమో దు చేస్తున్న కేసులు పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. అదే అక్రమార్కులకు అలుసుగా మారిం ది. నిజానికి 6ఏ కేసు అంత తీవ్రమైనది కాద ని, జిల్లా జేసీ కోర్టులో జరిమానా విధించి, ప ట్టుబడిన వాహనాన్ని విడిపించుకుని వచ్చేయవచ్చని ఆ శాఖ అధికారులే చెప్తున్నారు.
Updated Date - Jul 29 , 2025 | 12:24 AM