ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

28.6 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, Publish Date - May 08 , 2025 | 12:30 AM

తొండంగి, మే 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి శివారు తమ్మయ్యపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న 28.6 టన్నుల రేషన్‌ బియ్యాన్ని జిల్లా పౌరసరఫరా అధికారి రుద్రరాజు సత్యన్నారాయణ రాజు సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏపీ 39 యు

స్వాధీనం చేసుకున్న లారీతో పౌరసరఫరా శాఖ అధికారులు

తొండంగి, మే 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి శివారు తమ్మయ్యపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న 28.6 టన్నుల రేషన్‌ బియ్యాన్ని జిల్లా పౌరసరఫరా అధికారి రుద్రరాజు సత్యన్నారాయణ రాజు సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏపీ 39 యుడి 6507 అశోక్‌లేలాండ్‌ లారీలో విశాఖపట్నం పోర్టుకు అక్రమంగా పీడీఎస్‌ బి య్యం తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు డీఎస్‌వో సత్యన్నారాయణరాజు, డిప్యు టీ తహశీల్దార్లు బి.రాజు, వీరాస్వామిలతో కలి సి దాడి చేశారు. నల్లజర్లకు చెందిన శ్రీవినాయక ట్రేడర్స్‌ మద్దు సత్యన్నారాయణ, లారీ డ్రైవర్‌ గొలుసు శంకర్రావు అనధికార తరలింపునకు పాల్పడుతున్నట్టు గుర్తించి వారిపై 6 ఏకేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీ నం చేసుకున్న సరుకు లారీతో కలిపి రూ.29 లక్షలు ఉంటుందని, దీనిపై తొండంగి పోలీసు స్టేషన్లో క్రిమినల్‌ కేసు నమోదుచేశామన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:30 AM