ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసౌకర్యం!

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:02 AM

రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషనులోని రైలు కోచ్‌ రెస్టారెంట్‌ రైల్వేని బురిడీ కొట్టిస్తోంది. అస లు సదుపాయాన్ని పక్కనపెట్టి కొసరుతో గుత్తే దారు వ్యాపారం చక్కబెడుతుండగా.. అడ్డంగా మారిన సదుపాయం ప్రయాణికులకు అసౌక ర్యాన్ని కలిగిస్తోంది.

రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌

గుత్తేదారు గారడీ.. రైల్వే బురిడీ

అసలు పడక.. కొసరుతో వ్యాపారం

తెరవెనుక డివిజన్‌ స్థాయి అధికారి!

రైల్వే శాఖ ఉద్దేశం నిర్వీర్యం

అడ్డంగా మారిన సదుపాయం

అస్తవ్యస్తంగా రైలు కోచ్‌ రెస్టారెంట్‌

అదిరిపోతున్న ధరలు

ప్రయాణికుల జేబులు గుల్ల

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషనులోని రైలు కోచ్‌ రెస్టారెంట్‌ రైల్వేని బురిడీ కొట్టిస్తోంది. అస లు సదుపాయాన్ని పక్కనపెట్టి కొసరుతో గుత్తే దారు వ్యాపారం చక్కబెడుతుండగా.. అడ్డంగా మారిన సదుపాయం ప్రయాణికులకు అసౌక ర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడి నుంచి తర లిం చాలని.. ఇక్కడ అసలు అవసరమే లేదని వారు అభిప్రాయపడు తున్నారు. రైల్వే స్థలాన్ని గుత్తే దారు తెలివిగా ఉపయోగించుకుంటుంటే స్థానిక అధికారులకు ఆ చిత్రం కనబడడం లేదు.

అసలే ఇరుకు

ఈ రైల్వే స్టేషను ద్వారా రోజుకు 30 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. రద్దీ వేళల్లో వాహనాలు ఎక్కువగా వస్తుం టాయి. కోచ్‌ రెస్టారెంట్‌ని ప్రధాన ద్వారానికి సమీపంలో కీలకమైన ప్రదేశంలో పెట్టారు. దీంతో ఇక్కడ ప్రదేశం ఇరుకుగా మారి వాహ నాల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. అం దువల్ల ఇక్కడి నుంచి ఖాళీ స్థలం ఎక్కువ ఉన్న తూర్పు స్టేషను వైపునకు దీనిని తరలిం చాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఈ కోచ్‌ రెస్టారెంట్‌ని 24గంటలూ తెరిచి ఉంచే వెసులు బాటు ఉంది. దీంతో రాత్రి వేళల్లో శాంతి భద్ర తలకు విఘాతం కలుగుతోంది.

కొసరుతో వ్యాపారం

ఈ కోచ్‌ రెస్టారెంట్‌ని విజయవాడకు చెందిన ఓ కంపెనీ దక్కించుకొంది. కానీ మేనేజర్ల పేరు తో సబ్‌-కాంట్రాక్టుకు ఇస్తోంది. సబ్‌ కాంట్రాక్టరు నుంచి రోజుకు రూ.15 వేల వరకూ.. అంటే నెల కు రూ.4.5 లక్షలు.. ఏడాదికి సుమారు రూ.55 లక్షలు వసూలు చేస్తోంది. ఈ ఆదాయం అలా ఉంటే.. కోచ్‌ రెస్టారెంట్‌ని ఆనుకొని కొంత ప్రదే శం ఉంది. ఆ ప్రదేశంలో టీ, జ్యూస్‌, రోజ్‌ మిల్క్‌ స్టాల్స్‌ని ఏర్పాటు చేశారు. వాటి నుంచి నెలకు రూ.3 లక్షలు..ఏడాదికి రూ.35 లక్షల వర కూ గుత్తేదారుకు ముడుతోంది. కోచ్‌ రెస్టారెం ట్‌ని తెరవకపోతే ప్రయాణికులకు సదుపాయం ఉండకపోవచ్చు.. కానీ గుత్తేదారు మాత్రం కొస రులతో వ్యాపారం చేసేస్తున్నారు. అసలే అందవికారంగా ఉన్న రైలు కోచ్‌ రెస్టారెంట్‌ని తీసేసి స్టాల్స్‌ని ఏర్పాటు చేసినా రైల్వేకి ఏడాదికి రూ.కోటి వరకూ ఆదాయం సమకూరుతుంది.

ఇదే కారణమా..

కోచ్‌ రెస్టారెంట్‌ అస్తవ్యస్తంగా మారినా.. ఇష్టానుసారం నడిపిస్తున్నా అధికారులు పెద్ద గా చర్యలు తీసుకోలేకపోతున్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌ స్థాయిలో ఓ అధికారి అండ మెం డుగా ఉండడంతో గుత్తేదారుపై ఎలాంటి చర్య లూ తీసుకోలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరలను అధికంగా వసూ లు చేస్తున్నారు. ధమ్‌ టీ అంటూ 70 ఎంఎల్‌ టీని రూ.15కి విక్రయిస్తూ ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. రైలులో లేదా ప్లాట్‌ఫాంపై 120 ఎంఎల్‌ టీ రూ.10కే రైల్వే అందిస్తోంది. రోడ్డ దాటి నాలుగు అడుగులు వేస్తే రూ.100 -200కే బిర్యానీ లభిస్తేఈ రెస్టారెంట్‌లో రూ.350 వరకూ లాగేస్తున్నారు. టిఫిన్‌ విష యంలోనూ పరిస్థితి అలాగే ఉంది.డబ్బులకు తగిన పరిమా ణం,నాణ్యత ఉండదు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు తొలగించడంపై దృష్టి సారించాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.

సదుపాయమంటూ..

రాజమండ్రి స్టేషను ఎన్‌ఎస్‌జీ-2 జాబితాలో ఉంది. డివిజన్‌లో ఆదాయంలో విజయవాడ తర్వాత ఈ స్టేషను ఉంటుంది. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో భాగంగా 2023 ఆగస్టులో రైలు కోచ్‌ రెస్టారెం ట్‌ని ఏర్పాటు చేశారు. అప్పటికే విజయవాడ తదితర స్టేషన్లలో ఈ కాన్సెప్ట్‌ మంచి ఫలితాల ను ఇచ్చింది. వాడు కలోలేని ఒక రైలు కోచ్‌ని రైల్వే స్టేషను ప్రాంగణంలో ఏర్పాటు చేసి రెస్టారెంట్‌ మాదిరిగా మారుస్తారు. దీనిలో కూర్చుని తింటే రైలులో తిన్నట్టుగా అనుభూతి చెందాలనేది ప్రధాన ఉద్దేశం. రాజ మండ్రిలో కూడా అదే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. తొలి నుంచీ దీని నిర్వహణ మాత్రం సవ్యంగా లేదు. ఎప్పుడు తెరిచి ఉంటుందో స్థానిక అధికారులకు తెలియదు. ఈ రెస్టారెంట్‌ ఇక్కడే ఉంటే పుష్కరాల నాటికి పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.

నో పార్కింగ్‌.. వాహనదారుల జేబుకు చిల్లు

ఈ కోచ్‌ రెస్టారెంట్‌ కారణంగా రైల్వే స్టేషను ఇరుకుగా మారిపోయింది.. వాహనదారులకు పార్కింగ్‌ సమస్య వచ్చిపడింది. ఎవరినైౖనా రైలు ఎక్కించడానికి బైక్‌పై వస్తే బైక్‌ఎక్కడ పార్క్‌ చేయాలో తెలియని పరిస్థితి.. నిమిషమైనా బైక్‌ పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే. కోచ్‌ రెస్టారెంట్‌ చుట్టూ నో పార్కింగ్‌ బోర్డులే దర్శనమిస్తాయి. ఏ టీ తాగుతూనో అక్కడ వాహనం పార్క్‌ చేశామా ఆర్‌పీఎఫ్‌ పోలీసులు వచ్చి జరిమానా విధిస్తున్నారు. కాంట్రాక్టరు పార్కింగ్‌ ఫీజు కట్టకపోవడంతో ఈ సమస్య వచ్చిందని సమాచారం. వాహనదారులు మాత్రం కోచ్‌ రెస్టారెంట్‌ వస్తే వాహనాల పార్కింగ్‌ ఎక్కడనేది ప్రశ్న.

Updated Date - Jul 13 , 2025 | 01:03 AM