ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సాహంగా రగ్బీ పోటీలు

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:18 AM

పిఠాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం రగ్బీ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాల, బాలికల జట్లను ఎంపిక చేసే నిమిత్తం నిర్వహించిన పోటీల్లో పాల్గొనేందు

పిఠాపురంలో జరిగిన పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

పిఠాపురంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్ల ఎంపిక

పిఠాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం రగ్బీ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాల, బాలికల జట్లను ఎంపిక చేసే నిమిత్తం నిర్వహించిన పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర జట్టుకు 12 మంది, బాలికల జట్టుకు 12 మందిని ఎంపిక చేశారు. వారు ఈ నెల 28,29న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ రగ్బీ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. రగ్బీ కోచ్‌ పి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన పోటీలను రగ్బీ అసోసియేషన్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్‌ వియ్యపు రామన్నరాజు, సభ్యుడు ఇమ్మిడిశె ట్టి నాగేంద్రకుమార్‌ ప్రారంభించారు. శేషుకుమారి, సతీష్‌, నాగలింగేశ్వరరావు, సురేష్‌, చిన్నబ్బాయి, పవన్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

బాలుర జట్టు సభ్యులు

ఎం.జశ్వంత్‌, వి.రాము, ఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌, జి.ప్రసన్న, వీవీవీ రమణ, పి.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌.సుధీర్‌కుమార్‌, ఎస్‌.సువర్ణరాజు, పి.చందు, వి.అజయ్‌, బి.సుశాంత్‌, ఎస్‌.కరుణాకర్‌.

బాలికల జట్టు సభ్యులు

పీఎస్‌ తేజశ్రీ, వై.జ్యోతిచంద్రి, ఎస్‌.వినీల, డి.బేబీ, పి.దివ్య, ఎన్‌.చాందినిశ్రీ, జి.తేజస్విని, పి.సురణి, జి.మణిరాజేశ్వరి, టి.చంద్రకళ, వి.ధనలక్ష్మి, పి.నిర్మల, హర్షిణి. వారిని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్‌, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం. రగ్బీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దొరబాబు, కోచ్‌ లక్ష్మణరావు అభినందించారు.

Updated Date - Jun 23 , 2025 | 12:18 AM