సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ABN, Publish Date - May 20 , 2025 | 01:11 AM
ఏపీఎస్ ఆర్టీసీ రాజోలు డిపో నుంచి కాళేశ్వరం సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు సర్వీసులను ఈనెల 20, 22, 24 తేదీల్లో నడుపుతున్నామని డీఎం ధనమ్మ తెలిపారు.
రాజోలు, మే 19(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ ఆర్టీసీ రాజోలు డిపో నుంచి కాళేశ్వరం సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు సర్వీసులను ఈనెల 20, 22, 24 తేదీల్లో నడుపుతున్నామని డీఎం ధనమ్మ తెలిపారు. రాజోలులో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సూపర్‌లగ్జరీ బస్సు టిక్కెట్ ధర రూ.2,200, ఇంద్ర ఏసీ బస్సు రూ.2,700గా నిర్ణయించామన్నారు. గదుల అద్దెలు, భోజన వసతులను యాత్రికులే భరించాలన్నారు. వరంగల్ శ్రీభద్రకాళీ మాత, వేములవాడ శ్రీరాజేశ్వరి అమ్మవారు, కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారు, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి, కాళేశ్వరం శ్రీమహాకళేశ్వరుడు, పుష్కరస్నానం, రామప్ప దేవాలయ క్షేత్రాల దర్శనం ఉంటుందన్నారు. వివరాలు, టిక్కెట్ కోసం ఎన్‌ఎస్ బాబు సెల్: 9866177922, అసిస్టెంట్ మేనేజర్ సెల్: 9390485557, డిపో మేనేజర్ సెల్: 9959225538లో సంప్రదించాలని ఆమె కోరారు.
Updated Date - May 20 , 2025 | 01:11 AM