ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాసమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం

ABN, Publish Date - May 17 , 2025 | 01:14 AM

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం గా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో తన చాంబర్‌లో అన్ని విభాగాల ప్రధాన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రజల ను ంచి వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన రిపోర్టును సిద్ధం చేయాలన్నారు.

అధికారులతో సమీక్ష చేస్తున్న కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌
  • నగరపాలక సంస్థ శాఖాధిపతులతో సమీక్షలో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 16(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం గా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో తన చాంబర్‌లో అన్ని విభాగాల ప్రధాన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రజల ను ంచి వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన రిపోర్టును సిద్ధం చేయాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి రానున్న వర్షాకాలం నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా బీట్‌ ద హీట్‌ కార్యక్రమంపైన, వడగాల్పుల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రజలందరికీ వివరించాలన్నారు. శనివారం జరి గే తిరంగ్‌ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా నగర ప్రజలకు చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, సెక్రటరీ జి,శైలజావల్లి, సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌ ఎంసీహెచ్‌ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్‌ జి.కోటయ్య, ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, రెవెన్యూ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 01:14 AM