ప్రజల సమస్యపై అధికారుల దృష్టి
ABN, Publish Date - May 22 , 2025 | 01:13 AM
మురుగునీటి డ్రెయిన్ల క్ల్లీనింగ్‌పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు ఎంపీడీవో ఎ.రాజు అన్నారు.
ఆలమూరు, మే 21(ఆంధ్రజ్యోతి): మురుగునీటి డ్రెయిన్ల క్ల్లీనింగ్‌పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు ఎంపీడీవో ఎ.రాజు అన్నారు. ఆలమూరు మత్స్యకార కాలనీలో ఉన్న డ్రెయిన్ చెత్తతో మూసుకుపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి దాన్ని శుభ్రం చేసే పనిని బుధవారం ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న పనులను ఎంపీడీవో ఎ.రాజు, చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్, ఆలమూరు పంచాయతీ ఇన్‌చార్జ్ కార్యదర్శి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆల మూరు సిద్దార్ధ హైస్కూల్ నుంచి వచ్చే డ్రెయిన్ దిగువకు వెళ్లకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా పంచాయతీ డ్రైనేజీ వాటర్ కూడా ఇదే కాలువ ద్వారా వెళ్లవలసి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, ఎఎంసీ మాజీ చైర్మన్ ఈదల నల్లబాబు, జనసేన నాయకుడు బైరిశెట్టి రాంబాబు తదితరులు ఎంపీడీవో దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి పంచాయతీ సిబ్బందితో గ్రామంలోని మంచినీటి ట్యాంక్‌లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Updated Date - May 22 , 2025 | 01:13 AM