ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:00 AM

ప్రజా వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని రెడ్డి కన్వెన్షన్‌ హాలులో 42 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన అందించారు.

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే వాసు
  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • 42 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రజా వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని రెడ్డి కన్వెన్షన్‌ హాలులో 42 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చినాటి నుంచి ఇప్పటి వరకు తాను 128 మంది లబ్ధిదారులకు రూ.1.74 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌ కింద అందించామన్నారు. ఇంకా 46 ఫైల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో వాటిని కూడా మంజూ రు చేయించి అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి వుందన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఈనెల 12న తల్లికి వందనం, త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, పిక్కి నాగేంద్ర, వై.శ్రీనివాస్‌, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, బుడ్డిగ రాధా, కొయ్యల రమణ, నల్లం శ్రీను, కిలపర్తి శ్రీనివాస్‌, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్‌, కప్పల వెలుగుకుమారి, తురకల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

  • వెన్నుపోటుకు పేటెంటు జగన్‌దే: వాసు

తల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలి వేటు పై పూర్తి పేటెంట్‌ మాజీ సీఎం జగన్‌దేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని తన కార్యాలయం వద్ద జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర జలంతా కలిసి 11సీట్లకు పరిమితం చేసి వైసీపీ నాయకులకు పిండం పెట్టేశారని అయినా బుద్ధి రాలేదన్నారు. ఈ నెల 4న వెన్నుపోటు దినంగా నిర్వహించుకుంటున్న వైసీపీ నాయకులు దాని ని వైసీపీ తద్దినంగా మార్చుకుని చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అస లైన వెన్నుపోటుదారుడు జగన్‌ అని,ఆస్తి కోసం తల్లిని, చెల్లిని ఇంట్లోంచి బయటకు నెట్టేశాడ న్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజ లు ఏడాదిగా ఆనందంగా ఉన్నారన్నారు. మ ద్యం, క్వార్డ్జ్‌, మైనింగ్‌ కేసుల్లో వైసీపీ వాళ్లు ఉన్నందుకు ఈ కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వెన్నుపోటు దినం డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధి నేత పవన్‌కళ్యాణ్‌ పిలుపుతో..జగన్‌ పీడ వదిలి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి సుపరిపాలనపై కార్యక్రమం చేస్తున్నామన్నారు.బుధవారం స్థానిక నందం గనిరాజు సెంటర్‌ నుంచి జాం పేట బ్యాంక్‌ వరకు ర్యాలీ చేస్తున్నామన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 01:00 AM