ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువతకు మరింత ఉపాధి కల్పించాలి

ABN, Publish Date - May 21 , 2025 | 12:12 AM

భవిష్యత్తులో జిల్లా యువతకు మరిం త ఉపాధి ఆవిష్కరణ, అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంగణంలో ప్రాథమిక శిక్షణ తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం బొమ్మూరులోని నైపుణ్యాభివృద్ధి కేంద్రం కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యాలయ భవనం పనుల పురోగతిని పరిశీలించారు.

పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి
  • జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి..

  • టీ హబ్‌ స్థాపనపై అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష

రాజమహేంద్రవరం రూరల్‌, మే 20(ఆంధ్ర జ్యోతి): భవిష్యత్తులో జిల్లా యువతకు మరిం త ఉపాధి ఆవిష్కరణ, అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంగణంలో ప్రాథమిక శిక్షణ తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం బొమ్మూరులోని నైపుణ్యాభివృద్ధి కేంద్రం కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యాలయ భవనం పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే టీ హబ్‌ను రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ తో టీ-హబ్‌ ఆధునిక సంస్థ స్థాపన సాధ్యాసాధ్యాలపై పాలిటెక్నిక్‌ కాలే జీ ఆవరణలోని స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌కి కేటాయించిన స్థలాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నారు. స్థల లభ్యత, సద్వినియోగం, భవిష్యత్తు అవసరాలకు అనుకూలతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌, టెక్నాలజీ రంగాల్లో మార్గదర్శకంగా నిలిచేలా స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ గ్రాం టుతో భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చక్కటి ప్రణాళిక తయారు చేయాలని ఏపీఈడబ్ల్యుఐడీసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శంకర్‌ను ఆదే శించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చే యాలని, టి-హబ్‌ ద్వారా యువతలో నైపుణ్యశిక్షణ, ప్రోత్సాహం అందించాలని తద్వారా ఆత్మ విశ్వాసం పెరిగి స్వయం ఉపాధి పొందుతారని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంట ల్యాండ్‌ సర్వేయర్‌ ఏడీ బి.లక్ష్మీనారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళీ, తహశీల్దార్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:12 AM