ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రత్యేక పంచాయతీతోనే సమస్యలు పరిష్కారం

ABN, Publish Date - Apr 10 , 2025 | 01:30 AM

గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ శివారున నివాసం ఉంటున్న ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

కృష్ణునిపాలెంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ ప్రశాంతి

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సందర్శించిన కలెక్టర్‌

అప్పుడే కాలనీవాసులకు తగిన న్యాయం

గోకవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ శివారున నివాసం ఉంటున్న ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గత కొంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలెక్టర్‌ దృష్టికి తీసు కెళ్లడంతో బుధవారం ఆమె కాలనీని సందర్శించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ నిర్వాసితులను నేరుగా కలుసుకొని ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, ఉపాధి పనులు లేకపో వడం, శ్మశానవాటిక తదితర సమస్యలను ఇక్కడ నివాసం ఉంటున్న 18 పోలవరం నిర్వాసిత గ్రామాలవాసులు కలెక్టర్‌ దృష్టికి తీసికెళ్లారు. దీంతో జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ నిర్వాసి తులకు చెందిన రేషన్‌, ఆధార్‌, ఉపాధి హమీ పఽథకం జాబ్‌ కార్డులు ఇప్పటికీ ఏజెన్సీ పరిధిలో ఉండడం, అక్కడ నుంచి ఇక్కడకు ఇంతవరకూ బదిలీ కాకపోవడం వల్ల తగిన సౌక ర్యాలు ఏర్పాటు చేయలేకపోతునామన్నారు. వెంటనే నివాసితులంతా తమ గుర్తింపు కార్డులను గోకవరం మండలంలోకి బదిలీ చేయించుకొని, తద్వారా ప్రత్యేక పంచాయతీగా ఏర్పా టు చేసుకుంటే వెంటనే ప్రభుత్వపరంగా కల్పించాల్సిన మౌ లిక సదుపాయాలన్నీంటినీ పూర్తి చేస్తామని నిర్వాసితులకు ఆమె హమీ ఇచ్చారు. ఇందుకోసం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న 18 గ్రామాల ప్రజలతో గ్రామసభలు నిర్వహించి అంగీకారం తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారు లను ఆదేశించారు. నిర్వాసితుల సమస్యలను స్థానిక ఎమ్మె ల్యే నెహ్రూ పదేపదే తన దృష్టికి తీసుకురావడంతో తాను ఈ సందర్శనకు వచ్చానని కలెక్టర్‌ తెలియజేశారు. కార్యక్ర మంలో తహశీల్దారు సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:30 AM