ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలపై ఫీజులుం..

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:03 AM

రాజమండ్రికి చెందిన ఓ మెకానిక్‌ తన కొడుకును 1వ తరగతిలో చేర్పించడానికి ఆర్టీఈ చట్టం 12 (1)సీ ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసు కున్నాడు. తమ స్కూల్‌లో సీటు కేటాయింపు జరి గిందని, స్వయంగా వచ్చి మిగతా ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఓ కార్పొరేటు/ప్రైవేటు స్కూల్‌ నుం చి ఆయనకు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. పిల్లాడిని తీసు కుని ఆ స్కూల్‌కి వెళ్లాడు. అక్కడ విద్యార్థి చదువు, సామర్థ్యాన్ని పరీక్షించారు. అయితే ఆ పిల్లాడి లెవెల్స్‌ తమ స్కూలు స్టాండర్డుకు సరిపోదని చెప్పగా ఆ పేద తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాళ్లు తేరు కోకముందే.. ‘మీ పిల్లాడిని ఇక్కడే ఈ ఏడాది యూ కేజీలో జాయిన్‌ చేయండి. ఫీజు రూ.45వేలు’ అని సెలవిచ్చారు. తమ కొడుకు పట్ల శ్రద్ధ వహిస్తామని ఆ తల్లిదండ్రులు ప్రాథేయపడగా సరే అన్నారు.

పేద విద్యార్థులతో ప్రైవేటు స్కూల్స్‌ ఆటలు

పలు యాజమాన్యాల అతి తెలివి

అదనపు ఫీజులతో తల్లిదండ్రులు బెంబేలు

ఒకటో తరగతి సీటని.. యూకేజీ అడ్మిషన్‌

రాజమండ్రికి చెందిన ఓ మెకానిక్‌ తన కొడుకును 1వ తరగతిలో చేర్పించడానికి ఆర్టీఈ చట్టం 12 (1)సీ ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసు కున్నాడు. తమ స్కూల్‌లో సీటు కేటాయింపు జరి గిందని, స్వయంగా వచ్చి మిగతా ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఓ కార్పొరేటు/ప్రైవేటు స్కూల్‌ నుం చి ఆయనకు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. పిల్లాడిని తీసు కుని ఆ స్కూల్‌కి వెళ్లాడు. అక్కడ విద్యార్థి చదువు, సామర్థ్యాన్ని పరీక్షించారు. అయితే ఆ పిల్లాడి లెవెల్స్‌ తమ స్కూలు స్టాండర్డుకు సరిపోదని చెప్పగా ఆ పేద తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాళ్లు తేరు కోకముందే.. ‘మీ పిల్లాడిని ఇక్కడే ఈ ఏడాది యూ కేజీలో జాయిన్‌ చేయండి. ఫీజు రూ.45వేలు’ అని సెలవిచ్చారు. తమ కొడుకు పట్ల శ్రద్ధ వహిస్తామని ఆ తల్లిదండ్రులు ప్రాథేయపడగా సరే అన్నారు.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రైవేటు స్కూల్స్‌ వ్యాపార యావ.. చదువుకునే హక్కును కూడా చదువుకునేవిధంగా మార్చేస్తోంది. విద్యా హక్కు చట్టాన్ని(ఆర్టీఈ) అపహాస్యం చేస్తోం ది. సామాజిక బాధ్యత మాట అటుంచితే ఆయా పాఠశాలల యాజమాన్యాల తెలివి తేటలకు పేద పిల్లల తల్లిదండ్రులు కళ్లు తేలేస్తున్నారు. ఇప్పటికే ఫీజుల మోత మోగిస్తున్న ప్రైవేటు పాఠశాలలు.. పేద విద్యార్థుల నుంచి కూడా ఏదో రకంగా దండు కోవాలని చూస్తున్నాయి. అన్నీ కాకపోయినా అధిక శాతం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల పేదరికంతో ఆడుకుంటున్నాయి. తమ పిల్లాడికి కార్పొరేట్‌ స్కూ ల్లో ఉచితంగా సీటు లభించిందని ఆనందిస్తున్న తల్లిదండ్రులకు తీరా స్కూల్‌లో అడుగుపెట్టాక సొమ్ముల లెక్కలతో చుక్కలు చూపిస్తున్నారు. ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ నిరుపేద తల్లిదండ్రులు కన్నీటిని ఆశ్రయిస్తున్నారు. ఫీజు సంగతి ఎలా ఉన్నా.. అదనపు డబ్బులు చెల్లిం చుకోడానికి అప్పుల కోసం తిప్పలు తప్పడం లేదు.

తడిసి మోపెడు

విద్యా హక్కు చట్టప్రకారం ప్రతి కార్పొరేట్‌ స్కూల్‌లో ప్రతి ఏడాది ఒకటో తరగతిలో 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. అమ్మ ఒడి/తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రభు త్వం విద్యార్థుల తల్లికి ఇచ్చే డబ్బులను ఆ స్కూల్‌కి ఫీజు కింద చెల్లిస్తారు. ఈ విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ప్రక్రియ అనంతరం విద్యార్థి కోరుకున్న, ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న స్కూ లును కేటాయిస్తారు. ఇదంతా ఆన్‌ లైన్‌ ద్వారా జరుగుతుంది. కేటాయింపు మెసేజ్‌ సదరు విద్యార్థి పేరెంట్స్‌కి వెళుతుంది. తర్వాత స్కూల్‌కి వెళ్లి తదుపరి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉం టుంది. అయితే ఇక్కడే కొన్ని పాఠశాలలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బస్సు, యూనిఫాం, షూ, టై, ఆ రుసుము, ఈ ఫండు అంటూ తడిసి మోపెడు ఫీజును తల్లిదండ్రుల నెత్తి మీద పెడుతున్నారు. దీంతో ఆ పేద తల్లిదండ్రులకు ఏమీ పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది. ఆ మాత్రం డబ్బులు కట్టలేని వాళ్ళకు కార్పొరేట్‌ చదువు ఎందుకంటూ చులకన మాటలను కూడా తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇదో రకం సమస్య

గతంలో నేరుగా ఒకటో తరగతిలో చేర్చేవారు. తర్వాత ఎల్‌కేజీ, యూకేజీలు వచ్చి చేరాయి. ఆ కేజీలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండవు. కాస్త చిన్న కాన్వెంట్లలో తక్కువస్థాయిలో చదువు ఉంటుందన్న విషయం తెలిసిందే. పలువురు తల్లిదండ్రులు చిన్న పిల్లలు కదా.. అప్పుడే చదువు పేరుతో రుద్దడం ఎందుకని ఆలోచించడం వల్ల కూడా ఏబీసీడీల్లో సైతం వెనుకబడుతున్నారు. దీంతో కార్పొరేట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేర్చే సమయం వచ్చినపుడు ఈ పిల్లాడి స్థాయి కార్పొరేట్‌ చదువును అందుకోలేక పోతోంది. తరగతిలో పిల్లలందరిదీ ఒకరకం స్థాయి ఉంటే ఈ పిల్లలకు తక్కువ చదువు ఉంటోంది. దీంతో స్కూల్‌ యాజమాన్యాలు కూడా చేర్పించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాయి. తమ పిల్లలకు సరిగా చదువు చెప్పడం లేదనే మాట భవిష్యత్తులో తల్లిదం డ్రుల నుంచి పడాల్సి వస్తుందని భయపడుతున్నాయి. చదువులో వెనుకబడిన వారిని తీర్చిదిద్దడ మే అసలైన విద్యా నేర్పరితనం అనే వాదన వినవస్తోంది.

ఇబ్బంది ఉంటే చెప్పండి

ఆర్టీఈ చట్ట ప్రకారం పేద విద్యార్థులకు కేటా యించిన సీట్లలో కచ్చితంగా చేర్పించుకోవాలి. ఏదై నా సమస్య ఉంటే విద్యాధికారుల దృష్టికి తీసుకు రావాలి. అలాగే విద్యార్థుల చదువుపై తల్లిదం డ్రులకు కూడా శ్రద్ధ వహించే బాధ్యత ఉంటుంది. కాస్త పికప్‌ అయ్యే వరకూ ట్యూషన్‌ పెట్టించడం, ఇంట్లో పట్టించుకోవడం వంటివి చేస్తే మంచిది. ఇబ్బంది పెడుతున్నారని మాకు ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

కె.వాసుదేవరావు, జిల్లా పాఠశాల విద్యాధికారి, తూర్పుగోదావరి

Updated Date - Jun 08 , 2025 | 12:03 AM