ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖైదీలకూ..నేనున్నానని..

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:47 AM

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష విష యంలో గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర మనో వేదన మిగిలింది. అప్పట్లో జగన్‌ ఖైదీల క్షమా భిక్ష పట్ల చేసిన కాలయాపన వారి పాలిట శాపంగా మారింది.

సెంట్రల్‌ జైలు

కూటమి ప్రభుత్వంలో ఊరట

సుప్రీం మార్గదర్శకాల అమలు

జాబితాకు ప్రభుత్వ ఆదేశం

కసరత్తులో జైలు అధికారులు

వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం

గత జాబితా చెత్తబుట్టలోకి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

‘సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు క్షమాభిక్షను దూరం చేయడం ఏ మాత్రమూ సబబు కాదు. మంచి ప్రవర్తనతో ఉన్నవారికి మరోసారి బాగా జీవించే అవకాశం కల్పించడం సరైన నిర్ణయమే’

- దేశ సర్వోన్నత న్యాయస్థానం

2019లో జైలులో ఆస్పత్రి శంకుస్థాపనకు సీఎం హోదాలో చంద్రబాబు వచ్చినప్పుడు.. ‘మీరు మంచిగా మారండి. క్షమాభిక్ష జీవోల కోసం ఒత్తిడి పడొద్దు. నేనున్నాను. చూసు కుంటాను’ అని హామీ ఇచ్చారు. అయితే విధి దగా చేసింది. 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చింది. దీంతో క్షమాభిక్ష అవకాశాన్నిఆ ప్రభుత్వంలో ఖైదీలు కోల్పోయారనే చెప్పాలి. ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది.. ఖైదీల విడుదలకు చర్యలు చేపడుతున్నారు. - సీఎం చంద్రబాబు

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష విష యంలో గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర మనో వేదన మిగిలింది. అప్పట్లో జగన్‌ ఖైదీల క్షమా భిక్ష పట్ల చేసిన కాలయాపన వారి పాలిట శాపంగా మారింది. 2023లో జాబితా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ అప్పటి వైసీపీ ప్రభుత్వం పాటించకపోవడంతో ఆ జాబితా ఇప్పుడు చెత్త బుట్టలో పడేసే పరి స్థితి వచ్చింది. దీంతో రెండేళ్లుగా ఆ ఖైదీలు ఎ దురుచూపులు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభు త్వం ఎస్‌ఎల్‌పీ (క్రిమినల్‌) నెం.529/2021లోని సుప్రీం ఆదేశాలను పాటిస్తూ ఈనెల 17న జీవో నెం.71 జారీచేయడంతో పెండింగ్‌లో ఉన్న జాబితా నీరు గారిపోయినట్టేనని చెబుతున్నారు. జైళ్లశాఖ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితా సిద్ధం కానుంది.

నాడు వైసీపీలో ఒక్కసారే..

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి మూడు దఫాల్లో విడుదలకు అర్హులైన జాబితా లను అధికారులు ఎప్పటికప్పుడు పంపించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జగన్‌ ప్రభుత్వంలో ఎదురుచూపులతో ఖైదీలో జైలు లోనే మగ్గిపోయారు. జగన్‌ జమానా ఐదేళ్లలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు, మహిళా ప్రత్యేక జైలులో కలుపుకొని సుమారు 60 మం ది మాత్రమే బయటకు వెళ్లారు. 2021లో విడు దలకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా ఏడాది ఆలస్యంగా ఆగస్టు 15న 2022లో విడుదల చేశారు. మరో అన్యా యం ఏమిటంటే.. 2022లో వదిలిన ఖైదీలకు 2021ని కటాఫ్‌గా తీసుకున్నారు. అలా కాకుం డా 2022 కటాఫ్‌గా తీసుకుంటే మరికొంత మంది తమ కుటుంబాల చెంతకు చేరేవారు.

సుప్రీం మార్గదర్శకాలు..

గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఖైదీలను విడుదల చేసేవి. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిబంధనలు ఉండేవి. వీటిపై సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ఒకే విధమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం ఆయా రాష్ట్రాలు జీవోలు ఇవ్వాలి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సుప్రీం మార్గదర్శకాలను అనుసరిస్తూ జీవో విడుదల చేసింది.

గతం : సాధారణ జీవిత ఖైదీలకు ఏడేళ్లు శిక్ష, మూడేళ్ల రెమిషన్‌తో కలుపుకొని పదేళ్లు, 498(ఏ), డెకాయిటీ, దొంగతనాలు వంటి నేరాల్లో 14+6, మహిళలకు 3+2, 65 ఏళ్లు దాటిన వాళ్లకు ఐదేళ్ల శిక్ష, రెండేళ్ల రెమిషన్‌తో ఏడేళ్లు శిక్ష పూర్తి చేస్తే క్షమాభిక్షకు అర్హత ఉండేది.

ప్రస్తుతం : అన్ని జెండర్లకూ ఒకేలా నిబంధనలు ఉన్నాయి. మరణశిక్ష పడిన వారికి 14 ఏళ్ల జైలు.. ఆరేళ్ల రెమిషన్‌ మొత్తంగా 20 ఏళ్ల శిక్ష అనుభవించి ఉండాలి (ఆరేళ్ల రెమిషన్‌ నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్లపాటు సత్ప్రవర్తనతో జైలు జీవితం గడపాలి. జీవిత ఖైదులకు 7+3 ఉండాలి. ఎన్‌డీపీ ఎస్‌, ఎస్సీఎస్టీ కేసుల్లో, ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం చట్టం 2002 ప్రకారం, ఐపీసీ 363ఏ, 364, 364ఏ, 366, 366బీ, 367, 368, 369, 372, 373 ప్రకారం శిక్షపడిన వారు క్షమాభిక్షకు అర్హులు కాదు. మరికొన్ని నిబంధనలు ఇచ్చారు.

ఏడాదికి మూడు సార్లు

సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి ఏడాదికి మూడుసార్లు క్షమాభిక్ష జీవోలను విడుదలచే స్తారు. మొదటి ఫేజుకు జూన్‌1, రెండో ఫేజుకు అక్టోబరు 1, మూడో ఫేజుకు ఫిబ్రవరి 1 కటాఫ్‌ తేదీలుగా పరిగణిస్తారు. నాలుగు దశల్లో ప్రక్రి య పూర్తి చేయాల్సి ఉంటుంది.ఫేజ్‌ 1లో భా గంగా జనవరి 1 నుంచి 15వ తేదీలోపుగా, ఫేజ్‌ 2లో మే 1 నుంచి 15వ తేదీలోగా, ఫేజ్‌ 3లో సెప్టెంబరు 1 నుంచి 15వ తేదీలోగా అర్హు లైన ఖైదీలను గుర్తించాల్సి ఉంటుంది. ఆపై జైలు అధికారులు మూడు నెలల్లోగా సంబం ధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలి. జైలు అధికా రులు ప్రిజన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌కి సిఫారసు చేసిన తర్వాత మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందాలి. అనంతరం మూడు నెలల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడాలి. ఫేజ్‌1కి అక్టో బరు 1, ఫేజ్‌2కి ఫిబ్రవరి1, ఫేజ్‌ 3కి జూన్‌1లో గా ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది.

Updated Date - Apr 19 , 2025 | 12:47 AM