ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ధి

ABN, Publish Date - Apr 26 , 2025 | 01:31 AM

పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా రాష్ట్రంలోని కొన్ని రహదారుల్లో సర్వే నిర్వహించగా రెండో విడతలో మరి కొన్ని రహదారులను సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

పి.గన్నవరం అక్విడెక్టుపై సర్వే చేస్తున్న సిబ్బంది, ఆర్‌అండ్‌బీ డిఈ రాజేంద్ర

మొదటి దశలో జొన్నాడ-కాకినాడ రహదారికి శ్రీకారం

రెండవ దశలో కోనసీమ జిల్లాలో సాగుతున్న సర్వే

పి.గన్నవరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా రాష్ట్రంలోని కొన్ని రహదారుల్లో సర్వే నిర్వహించగా రెండో విడతలో మరి కొన్ని రహదారులను సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈనేపఽథ్యంలో పూర్తి స్థాయిలో సర్వే చేయడంతోపాటు ఆయా జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధుల అభిప్రా యాలను సైతం పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రెండు రహదారులను లీ- అసో సియేట్స్‌ సంస్థ ద్వారా సర్వే చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విడతగా జొన్నాడ-కాకినాడ (సుమారు 60 కిలోమీటర్లు) రహదారిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ రహదారికి సంబంధించి ఓ ప్రైవేటు సంస్థ సర్వే పూర్తి చేసిందని తెలిసింది. రెండో విడతగా కోనసీమ జిల్లాలో రాజవరం- పొదలాడ (సుమారు 61.425 కిలోమీటర్లు), అమలాపురం-బొబ్బర్లంక (59.5 కిలోమీట ర్లు) రహదారులను అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లీ-అసోసియేట్స్‌ సంస్థ ప్రతినిధులు రాజవరం-పొదలాడ రహదారిలో పి.గన్న వరం ప్రధాన రహదారి, అక్విడెక్టు పరిసరాల్లో నిర్వహించారు. ఈ సర్వేను ఆర్‌అండ్‌బీ డీఈ రాజేంద్ర పరిశీలించి పలు అంశాలపై వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సర్వేలో ముఖ్యంగా ట్రాఫిక్‌ అంశాలను పరిశీలిస్తారు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభు త్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం అభివృద్ధి బాధ్యత అప్పగించనుంది.

Updated Date - Apr 26 , 2025 | 01:31 AM