ప్రైవేట్ స్కూల్స్‌లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:47 AM
సమగ్రశిక్ష రాష్ట్ర ఎస్పీడీ ఆదేశాల మేరకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా సూచించారు.
అమలాపురం రూరల్, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష రాష్ట్ర ఎస్పీడీ ఆదేశాల మేరకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా సూచించారు. సీట్ల కేటాయింపులో భాగంగా జిల్లాలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో వెంటనే రిజిష్టర్ కావాలన్నారు. ఆల్లర్నేటివ్ స్కూల్స్ కోఆర్డినేటర్ డి.రమేష్‌బాబు అధ్యక్షతన సోమవారం సమనస ఢిల్లీ పబ్లిక్ స్కూలులో ఆయా పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించినసమావేశంలో డీఈవో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్ర్టేషన్ చేయించుకోని పాఠశాలలపై రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తారని హెచ్చరించారు. గడువులోగా రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. మండల విద్యాశాఖాధికారులు12(1)సీ నోటిఫికేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్‌ల సహకారం తీసుకోవాలని రమేష్‌బాబు సూచించారు. అమలాపురం, రామచంద్రపురం ఉపవిద్యాశాఖాధికారులు గుబ్బల సూర్యప్రకాశం, పి.రామలక్ష్మణమూర్తి, డీఈవో కార్యాలయ ఏడీ నక్కా సురేష్, సీఎంవో బొరుసు వీవీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బీర హనుమంతరావు, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:47 AM