ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గతేడాది ధరలు ఊహించుకోవద్దు..

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:38 AM

అంత ర్జాతీయ స్థాయిలో మన ఆంధ్రలో పండించే పొగాకుకు మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్య మైన పొగాకు ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు నాణ్యతను పరిశీలిస్తున్న బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

దేవరపల్లి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): అంత ర్జాతీయ స్థాయిలో మన ఆంధ్రలో పండించే పొగాకుకు మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్య మైన పొగాకు ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ పేర్కొన్నారు. దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని సోమ వారం ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. అంతర్జాతీయంగా పొగాకు మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉందన్నారు. ఎన్‌ఎల్‌ ఎస్‌ ఏరియాలో పండించే పొగాకుకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఉందని దాన్ని కాపాడుకుని నాణ్యమైన ఉత్పత్తి చేయాలన్నారు.గతేడాది బ్రెజిల్‌ జింబాబ్వే దేశాల్లో పొగాకు అతి తక్కువగా ఉత్పత్తి అయ్యిందని అందు వల్ల మన దేశ పొగాకుకు విపరీతమైన గిరాకీ వచ్చి రూ.400 పైగా ధర పలికిందని తెలి పారు. ప్రస్తుతం మన పొగాకుకు వేలంలో గతేడాది ధరలు ఊహించుకోవద్దన్నారు. ఏపీలో 167 మిలియన్‌ కిలోల పొగాకుకు బోర్డు అనుమతించగా 240 మిలియన్‌ కిలోలు పండించినట్లు అంచనా ఉందన్నారు.అంతర్జాతీయంగా మనకు పోటీగా ఉండే దేశాల్లోనూ ఈ ఏడాది పొగాకు ఉత్ప త్తి పెరిగిందన్నారు. రైతులు ఈలపోలు చిన్ని, ధర్మావతారం, కరుటూరి శ్రీనివాస్‌, నరహర శెట్టి రాజేంద్ర బాబు మాట్లాడుతూ పొగాకు వేలానికి రైతులు 100 బేళ్లు తీసుకొస్తే 20 శాతం కొనుగోలు చేయడం లేదని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోళ్లలో ఒకటి, రెండు కంపెనీలు తప్ప మిగతా కంపెనీలు ముం దుకు రావడంలేదని రైతులు తెలిపారు. కర్ణా టకలో ఈ ఏడాది ఒక నెల లేటుగా అమ్మ కాలు జరిగాయని దాని కారణంగా మనకు ఆలస్యంగా కొనుగోలు కంపెనీలు వస్తాయని తెలిపారు.కార్యక్రమంలో ఆర్‌ఎం జీఎల్‌కే.ప్ర సాద్‌, వేలం నిర్వహణాధికారి హేమస్మిత, రైతులు కరుటూరి శ్రీనివాసరావు, కాట్రు సత్య నారాయణ, పరిమి శ్రీరామకృష్ణ, దుద్దుపూడి హరి బాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:38 AM