ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనాథల సంక్షేమానికే పీఎం కేర్‌ పథకం

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:56 AM

కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల సంక్షేమానికి ప్రధాని మోదీ పీఎం కేర్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

పీఎం కేర్‌ అందుకుని మాట్లాడుతున్న సుమామణి

రూ.10 లక్షల చెక్‌ అందజేసిన ఎంపీ

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల సంక్షేమానికి ప్రధాని మోదీ పీఎం కేర్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పోలీస్‌ కన్వెన్షన్‌ హాలులో శుక్రవారం ఐసీడీఎస్‌ నిర్వహించిన కార్యక్రమంలో దేశంలోనే మొట్టమొదటి పీఎం కేర్‌ ఆర్థిక సహాయం రూ.10 లక్షల చెక్కును బొబ్బిల్లంకకు చెందిన ఎస్‌.సుమామణికి అందజేశారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన సుమామణి తల్లిదండ్రులు మృత్యువాతపడ్డారు. దీంతో అనాథగా మిగిలింది. అనంతరం సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన యువకుడిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తున్నారు.ఆమె పీఎం కేర్‌ పథకానికి ఎంపిక కాగా శుక్రవారం ఎంపీ పురందేశ్వరి రూ.10 లక్షల చెక్‌ అందజేసి మాట్లాడారు. మానవసేవే మాధవసేవ అనే సూక్తికి ఉదాహరణ పీఎం కేర్‌ పథకం అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పీఎం కేర్‌ గొప్ప పథకమని అన్నారు.ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు పీఎం కేర్‌ అందించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్‌ ప్రశాంతి,ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, అర్బన్‌ సీడీపీవో నర్సమ్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:56 AM