ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:48 AM
పర్యావరణానికి పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్ భూ తాన్ని తరిమి కొడదామని జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతీ మూడో శనివారం నిర్వహించే స్వ ర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు.
డీపీవో శాంతామణి
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు
పలుచోట్ల అవగాహన ర్యాలీలు
కడియం, జూలై 19(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్ భూ తాన్ని తరిమి కొడదామని జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతీ మూడో శనివారం నిర్వహించే స్వ ర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమగిరిలో జరిగిన గ్రామసభలో డీపీవో పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం జీవో 81 అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్లాస్టిక్ విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పలు షాపుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ విక్రయాలపై ఆరా తీసారు. గ్రామ సభ అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, కార్యదర్శి రూప్‌చంద్ పాల్గొన్నారు. కడియంలో సహకార శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కడియం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ వెలుగుబంటి రఘురామ్, ముద్రగడ సుధ, తుమ్మెద వరహాల రాజు, సీఈవో ఎస్ అప్పారావు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
ధవళేశ్వరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): స్వ చ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం విచ్చేసిన జిల్లా పంచాయతీ అధి కారి వి.శాంతమణి పంచాయతీ కార్యదర్శి వెం కట్రావులతో కలిసి ప్లాస్టిక్ సామగ్రి అమ్మే హోల్‌సేల్ షాపులను తనిఖీ చేశారు. షాపుల్లో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్యాకేజింగ్ బాక్స్‌లు, నిషేధిత ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయా నికి తరలించారు. నిషేధిత ప్లాస్టిక్ సామగ్రిని అమ్మవద్దని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 12:48 AM