మొక్కల పెంపకాన్ని విస్తృత పరచాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 01:11 AM
రాబోయే వర్షాకాలంలో జిల్లాలో మొక్కలు నాటుటకు అనువైన పరిస్థితుల నే పథ్యంలో అకిరా మియావాకి విధానంలో మొ క్కలు నాటడం ద్వారా దట్ట్టమైన అడవులు పెంచడా నికి విస్తృత ప్రచారం కల్పించి జిల్లా లో ఈ పథకం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ఈ మేరకు గురువా రం ఒక ప్రకటన విడుదల చేశారు.
అకిరా మియావాకి విధానాన్ని విజయవంతం చేయాలి
కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 19(ఆం ధ్రజ్యోతి): రాబోయే వర్షాకాలంలో జిల్లాలో మొక్కలు నాటుటకు అనువైన పరిస్థితుల నే పథ్యంలో అకిరా మియావాకి విధానంలో మొ క్కలు నాటడం ద్వారా దట్ట్టమైన అడవులు పెంచడా నికి విస్తృత ప్రచారం కల్పించి జిల్లా లో ఈ పథకం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ఈ మేరకు గురువా రం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అకిరా మియావాకి విధానం ద్వారా అన్ని మండలాల్లో గుర్తించిన ప్రదేశాల్లో మొక్కలు పెంపకం గత సంవత్సరం సెప్టెంబరు నెలలో మొదలుపెట్టినట్టు కలెక్టర్ తెలిపారు. 25 సెంట్ల స్థలంలో 2700 మొక్కలు పెంచడానికి రూ.4.82 లక్షల అంచనాలతో పను లు చేపట్టామన్నారు. జపాన్‌కు చెందిన అకిరా మియావాకీ 1970లో ఆ దేశంలో బంజరు బీడు భూముల్లో పచ్చదనం విస్తృత స్థాయిలో పెంపొందించేందుకు ఈ విధానాన్ని తొలిసా రిగా చేపట్టారన్నారు. గ్రామాల్లో తక్కువ విస్తీ ర్ణంలో ఎక్కువ మొక్కలు నిర్ధిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయని ఈ విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. విశే షమైన ఫలితాల ఆధారంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సంయుక్తంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ మండలాల్లోని 36 ప్రదేశా ల్లో 36 పనులు మంజూరు చేశామని, వాటిలో 13 చోట్ల పనులు ప్రారంభించి, ఇప్పటివరకు రాజమహేంద్రవరం రూరల్, గోకవరం, సీతాన గరం, తాళ్లపూడి, కోరుకొండ, నల్లజర్ల మండలా ల్లో ఒక్కొక్కటి చొప్పున అకిరా మియావాకి పద్ధ తిలో మొక్కలు నాటినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పద్ధతిలో గత సెప్టెంబరు 23న కలెక్టరేట్ ఆవరణ, మిగతా ప్రాంతాల్లో నాటిన మొక్కల ఎదుగుదల సంతృప్తినిచ్చిందన్నారు. పంచాయ తీ, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో ఈ పథకం విజయవంతం కావడా నికి కృషిచేయాలని కలెక్టర్ కోరారు.
Updated Date - Jun 20 , 2025 | 01:11 AM