ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రణాళికాబద్ధంగా చదవాలి

ABN, Publish Date - May 14 , 2025 | 12:46 AM

అకడమిక్‌ పరీక్షలకు, పోటీ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని పోటీ పరీక్షల కోచింగ్‌ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ప్రణాళికాబద్ధమైన, సృజనాత్మక పఠనంతో డీఎస్సీ విజయం ఖాయమన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో యూటీఎఫ్‌, డీవైఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సమకాలీన వ్యాసాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి
  • పోటీ ఎక్కువ.. సమయం తక్కువ

  • పునశ్చరణకు ప్రాధాన్యమివ్వాలి

  • పోటీపరీక్షల కోచింగ్‌ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

  • డీఎస్సీపై అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 13(ఆంధ్రజ్యోతి): అకడమిక్‌ పరీక్షలకు, పోటీ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని పోటీ పరీక్షల కోచింగ్‌ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ప్రణాళికాబద్ధమైన, సృజనాత్మక పఠనంతో డీఎస్సీ విజయం ఖాయమన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో యూటీఎఫ్‌, డీవైఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అభ్యర్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, గత పరీక్షల ప్రశ్నాపత్రాల మోడల్‌ చూసుకోవాలని అన్నారు. చాలా కాలం తర్వాత డీఎస్సీ నిర్వహిస్తున్నందున పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. అభ్యర్థులు కొత్త విషయాలు ఎక్కువగా నేర్చుకునే కన్నా తాము చదివిన సబ్జెక్టును మననం చేసుకుంటూ పునశ్చరణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పరీక్షల నిర్వహణకు సమయం కాస్త తక్కువ ఉన్నందున గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. సందేహాలను నివృత్తిచేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు పలు పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం ‘సమకాలీన వ్యాసాలు’ అనే పుస్తకాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణకుమారి ఆవిష్కరించారు. ఆయన రాసిన విద్యా మనో విజ్ఞానశాస్త్రం స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, ఏ.షరీఫ్‌, డీవైఎఫ్‌ఐ బాధ్యులు రాంబాబు, యూటీఎఫ్‌ నాయకులు పవన్‌కుమార్‌, కే.విజయగౌరి, వీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, కే.రమేష్‌, చిలుకూరి శ్రీనివాసరావు, దయానిధి, రమణమూర్తి, ఎం.శ్రీనివాస్‌, రూపస్‌రావు, ప్రకాష్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:46 AM