కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో 556 వినతులు
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:34 AM
కలెక్టరేట్ (కాకినాడ), జూన్30(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో సోమవా రం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 556 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా పీజీఆర్‌ఎస్‌లో అం
ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కరించాలి : కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్ (కాకినాడ), జూన్30(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో సోమవా రం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 556 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా పీజీఆర్‌ఎస్‌లో అం దిన ప్రతి అర్జీనీ పరిశీలించి పరిష్కరించాల న్నారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసిన తర్వాత వాటిని మళ్లీ రాష్ట్రస్థాయిలో ఆడిట్ చేస్తారన్నారు. అందులో గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. ఎక్కువ ఫిర్యాదులు రీఓపెన్ అయ్యే శాఖల అధికారులు దరఖాస్తుల పట్ల ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు హాజరుకాలేని వారు తమ అర్జీలను మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకో వాలన్నారు. కాగా బియ్యం కార్డుల మంజూరు, కార్డులో పేర్లు మార్పులు-చేర్పులు, పింఛన్లు, ఇళ్లస్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమో దు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు, కాలు వల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం అంశాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయి. జేసీ రాహుల్ మీనా, డీఆర్వో వెంకట్రావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణరావు, జీజీహెచ్ పరిపా లనాధికారి శ్రీధర్, సీపీవో త్రినాథ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 01:34 AM