ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై ఆడిట్‌

ABN, Publish Date - May 20 , 2025 | 12:48 AM

రాష్ట్రస్థాయిలో జరిగిన ఆడిట్‌ నివేదికల ప్రకారం 50 శాతం మంది ఫిర్యాదు దారులకు ఎండార్స్‌మెంట్‌లు అందలేదన్న ఆరో పణలు వస్తున్నాయని కలెక్టర్‌ పి.ప్రశాంతి అ న్నారు.

నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయంలో మిగిలిన ఉద్యోగులు

రాజమహేంద్రవరం రూరల్‌, మే 19 (ఆం ధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయిలో జరిగిన ఆడిట్‌ నివేదికల ప్రకారం 50 శాతం మంది ఫిర్యాదు దారులకు ఎండార్స్‌మెంట్‌లు అందలేదన్న ఆరో పణలు వస్తున్నాయని కలెక్టర్‌ పి.ప్రశాంతి అ న్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో జేసీ ఎస్‌.చిన్నరాముడు, డీఆర్‌వో సీతారామమూర్తి, ఇతర అధి కారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు ఎండార్స్‌ మెంట్‌లు అందడంలేదనే ఫిర్యాదులు రాకుం డా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్వీకరిం చిన ప్రతి ఫిర్యాదుకు ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాల న్నారు. అఽధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఫిర్యాదుపై సమగ్ర అవగాహన పొందవచ్చ న్నారు. కొన్ని సమస్యలను ఎంపీడీవో, తహశీల్దార్‌, ఎస్‌హెచ్‌వో కూడిన మండల స్థాయి కమిటీకి నివేదిస్తున్నట్టు తెలిపారు. పరిష్కారం చూపలేని అంశాలకు కారణాలు తెలపకపోతే సీఎంవో నుంచి పదేపదే ఆదేశాలు వస్తూనే ఉంటాయని తెలిపారు. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సమకూర్చిన రూ.25 వేలు విలువైన కృత్రిమ అవయవాలను కలెక్టర్‌ ప్రశాంతి నలుగురికి అందించారు. కార్యక్రమంలో సీపీవో ఎల్‌.అప్పలకొం డ, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, ఇన్‌చార్జి డీఎస్‌వో ఎంఆర్‌ఆర్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

డీపీవోలో గ్రీవెన్స్‌కి 40 అర్జీలు

రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌(పబ్లిక్‌ గ్రీవెన్స్‌) కు జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ నరసింహ కిశోర్‌ స్వయంగా మాట్లాడి 40 అర్జీలను స్వీకరించారు. వారి సమక్షంలోనే సంబంధిత అధికారితో మాట్లాడి చట్ట ప్రకారం త్వరితగతిన ఫిర్యాదును పరిష్క రించాలని ఆదేశించారు.అడిష నల్‌ ఎస్పీలు ఏవీ.సుబ్బరాజు, ఎల్‌.అర్జున్‌, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హాజరు 14.. ఉన్నది 8

మంత్రి ఇలాఖాలో అధికారుల తీరిది

నిడదవోలు, మే 19 (ఆంధ్రజ్యోతి) : సాక్షాత్తూ మంత్రి దుర్గేష్‌ నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో ఉంటున్నారు..ప్రజల సమస్య లు వినేందుకు టైమ్‌ కేటాయించలేకపోతు న్నారు..హాజరు వేయించుకుని వెళ్లిపోయి పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిడద వోలు తహశీల్దార్‌ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సుమారు 25 మంది మం డలస్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం 10.30 కల్లా 14 మంది అధికారులు హాజరుపట్టీలో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. తహశీల్దార్‌ బి.నాగ రాజు నాయక్‌తో పాటు మరో ఏడుగురు మాత్రమేపాల్గొన్నారు.అయ్యా మంత్రి వర్యా అధికారుల పనితీరుపై దృష్టి సారించండి

Updated Date - May 20 , 2025 | 12:48 AM