వైసీపీ నాయకులే టార్గెట్
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:46 AM
రాజమహేంద్రవరం, జూలై 23 (ఆం ధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్ప డినప్పటి నుంచి వైసీపీ శ్రేణులను ముఖ్య ంగా ప్రధాన భూమిక పోషించే నాయ కులను టార్గెట్ చేసి అనేక రకాలుగా ఇబ్బ ందులు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథు న్ రెడ్డిని ములాఖత్ ద్వారా బుధవారం కలిశారు. ఆయన వెంట మాజీ హోం మం త్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నారు. అనంతరం జైలు బయట మీడియాతో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్‌తో ములాఖత్
రాజమహేంద్రవరం, జూలై 23 (ఆం ధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్ప డినప్పటి నుంచి వైసీపీ శ్రేణులను ముఖ్య ంగా ప్రధాన భూమిక పోషించే నాయ కులను టార్గెట్ చేసి అనేక రకాలుగా ఇబ్బ ందులు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథు న్ రెడ్డిని ములాఖత్ ద్వారా బుధవారం కలిశారు. ఆయన వెంట మాజీ హోం మం త్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నారు. అనంతరం జైలు బయట మీడియాతో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులపై అనేక రకాల కేసులు పెడుతున్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు గానీ వారి మంత్రివర్గ సభ్యులు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ శ్రేణులు తప్పకుండా ఈ పరి స్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ప్రభు త్వం తీసుకొనే చర్యలను ఖండిస్తున్నామ న్నారు. మిథున్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొంటారని, సౌకర్యాలను కోరుకునే వ్యక్తి కాదన్నారు. న్యాయపరంగా కల్పించిన సదుపాయాలను కల్పి ంచడం లేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా రని ఆరోపించారు. మిథున్ బాగున్నారని, సం తోషంగా ఉన్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే న్యాయ స్థానాల నే ఆశ్రయిస్తామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ధరలు పెంచడం ద్వారా మ ద్యాన్ని నియంత్రించామని తానే టి వనిత అన్నారు. మా ప్రభుత్వం అధికారంలో ఉ న్నప్పుడు స్కాం జరిగిందని లేనిపోని నిం దలు మోపుతున్నారన్నారు. భరత్‌రామ్ మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారన్నారు.
వైసీపీ శ్రేణుల హల్‌చల్
రామచంద్రారెడ్డి కారుకు ముందు ఉన్న కార్ల బయట నుంచొని వైసీపీ యువకులు హల్‌చల్ చేశారు. జైలు వద్ద ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతో సహా సుమారు 100 మందితో బందో బస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ పర్యవేక్షించారు. రామచంద్రారెడ్డి వస్తున్న సమయంలో వైసీపీ యువ కులు డివైడ్ దాటి జైలు వైపునకు దూసుకురావడం గమనించిన మురళీకృష్ణ ఒక్క ఉదుటున వెళ్లి వెనక్కి పంపేశారు. రామచంద్రారెడ్డి వెంట కారు మూరి నాగేశ్వరరావు, జక్కంపూడి రాజా, తోట త్రిమూ ర్తులు తదితర వైసీపీ నాయకులు రాగా.. నిబంధనల ప్రకారం జైలు బయటే పోలీసుల ఆపేశారు. దీంతో పోలీసులతో వాళ్లు వాగ్వాదాని కి దిగారు. పోలీసులు అతికష్టంపై వాళ్లను రోడ్డు అవతలకు పంపే శారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రిజన్ కేఫ్‌ని మూయించారు.
Updated Date - Jul 24 , 2025 | 12:46 AM