సత్యదేవునికి రూ.3.50 లక్షల విలువైన నూతన పట్టువస్త్రాల బహూకరణ
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:35 AM
అన్నవరం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాలు వచ్చే నెల 7నుంచి ప్రారంభంకానుండగా 8వ తేదీ రాత్రికి దివ్యకల్యాణం అంగరంగ వైభవం గా జరగనుంది. ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు, సీతారాములు, వనదుర్గ, కనకదుర్గలకు విజయవాడకు చెందిన రావాడ చిరంజీవి
అన్నవరం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాలు వచ్చే నెల 7నుంచి ప్రారంభంకానుండగా 8వ తేదీ రాత్రికి దివ్యకల్యాణం అంగరంగ వైభవం గా జరగనుంది. ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు, సీతారాములు, వనదుర్గ, కనకదుర్గలకు విజయవాడకు చెందిన రావాడ చిరంజీవిరావు దంపతులు సుమారు రూ.3.50 లక్షలు విలువచేసే పట్టువస్త్రాలను ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌లకు అందజేశారు. దాతను వారు అభినందించారు. జంగారెడ్డిగూడెనికి చెందిన వి. రాము కల్యాణోత్సవంలో వినియోగించేందుకు గోటితో ఒలిచిన తలంబ్రాలను అందజేశారు. స్వామి సన్నిధిలో వారాంతపు ఆర్జితసేవ అయి న రథోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది.
కల్యాణోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
వచ్చే నెల 7నుంచి ప్రారంభమయ్యే స్వామివారి దివ్యకల్యాణోత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా పోస్టర్‌ను ఆదివారం ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్, దేవస్థానం పండితులు,ఇతర అధికారులు ఆవిష్కరించారు.
పలు ఆర్జితసేవలు రద్దు
స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు ఆర్జితసేవలను తా త్కాలికంగా రద్దుచేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా నిత్యకల్యాణా లు, ఆయుష్యహోమం, చండీహో మం, ప్రత్యంగిర హోమం, సహస్ర దీపాలంకరణ, పంచహారతుల సేవలను నిలుపుదల చేస్తున్నామన్నారు.
Updated Date - Apr 21 , 2025 | 12:35 AM