పార్కులతో ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం
ABN, Publish Date - May 25 , 2025 | 12:10 AM
రాజమహేంద్రవరం ప్రజలకు ఆరోగ్యంతో పాటు చక్కటి ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో పదో డివిజన్‌లో ఆల్ బ్యాంక్ కాలనీ పార్కు, 9వ డివిజన్ స్టేట్ బ్యాంక్ కాలనీ పార్కులను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.
దశల వారీగా అభివృద్ధి
నాలుగు ప్యాకేజీలుగా పనులు
మొదటి ప్యాకేజీలో రూ.1.96 కోట్లతో ఏడు పార్కులు
మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రజలకు ఆరోగ్యంతో పాటు చక్కటి ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో పదో డివిజన్‌లో ఆల్ బ్యాంక్ కాలనీ పార్కు, 9వ డివిజన్ స్టేట్ బ్యాంక్ కాలనీ పార్కులను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. మొ త్తం నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపడుతున్నామని, మొదటి ప్యాకేజీలో రూ.1.96 కోట్లతో ఏడు పార్కు లు అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే మూడు పార్కుల్లో పనులు ప్రారంభించామన్నారు. 9వ డివిజన్‌లో స్టేట్ బ్యాంక్ కాలనీ పార్కులో చిన్నారులు ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట వస్తువులతోపాటు విశాలమైన వాకింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. 10వ డివిజన్‌లో ఆల్ బ్యాంక్ కాలనీలో పార్కును మ్యూజికల్ పార్కుగా అభివృద్ధి పరచనుండగా ఇందులో అందరికి ఆకర్షించేలా వివిధ సంగీత వాయిద్యాలతో కూడిన శిల్పాలు ఉంటాయన్నారు. అలాగే స్థానిక మోడల్ కాలనీలో పార్కును యోగా పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఈఈ మదా ర్స ఆలీ షేక్, ఏడీహెచ్ స్వాతి, డీఈకే నిరూపాక్షరావు, ఏఈలు సత్యనారాయణ, సంజయ్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 12:10 AM