ధాన్యలక్ష్మి.. వచ్చేసింది!
ABN, Publish Date - Jul 10 , 2025 | 01:20 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దాదాపు రెండు నెలలుగా పేరుకుపోయిన ధాన్యం బాకీ లకు మోక్షం కల్పించింది.
ధాన్యం బకాయిలన్నీ విడుదల
మొత్తం రూ.362 కోట్లుపైనే
24 గంటల్లో చెల్లించేలా నిర్ణయం
నేడు,రేపు జమకానున్న డబ్బులు
కోనసీమకు రూ.189 కోట్లు
తూర్పునకు రూ. 93.74 కోట్లు
కాకినాడకు రూ.80 కోట్లు
బాకీల విడుదలతో హర్షం
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దాదాపు రెండు నెలలుగా పేరుకుపోయిన ధాన్యం బాకీ లకు మోక్షం కల్పించింది.ఈ మేరకు 24 గంట ల్లోగా వీటిని చెల్లించాలని బుధవారం జరిగిన కేబినెట్ సమా వేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పేరుకు పోయి న రూ.362.72 కోట్ల బాకీలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఆసన్నమైన తరుణంలో బాకీలు పంట పెట్టు బడికి ఉపయోగపడనున్నాయని రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రూ.1327 కోట్లు చెల్లింపు
ఈ ఏడాది రబీ సీజన్‌లో ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతల నుంచి ధాన్యం సేకరించింది. ఈ మేరకు అన్నదాతలకు ఇప్పటి వరకు రూ.1,327 కోట్లు చెల్లింపులు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలు నరకం చూసేవారు.కానీ ప్రభుత్వం మారాక రబీ సీజ న్‌లో రైతులు పండించిన ధాన్యం దాదాపు కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. తేమ శాతం దగ్గర నుంచి కొనుగోలు వరకు ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవ హరించింది. మే నెల వరకు సుమారుగా 7.05 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొను గోలు చేసింది. కాకినాడ జిల్లాలో 15,667 మంది అన్నదాతల నుంచి 1.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇం దుకు రూ.322 కోట్ల వరకు బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే 1,167 మంది రైతులకు రూ.242 కోట్లు జమ చేసే సింది. తూర్పుగోదావరి జిల్లాలో 30,481 మంది అన్న దాతల నుంచి 3.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. దీని విలువ రూ.814 కోట్లు.ఇప్పటి వరకు రైతులకు రూ.721 కోట్లు చెల్లించేసింది.ఇంకా రూ.93.94 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. కోనసీమ జిల్లా 22 మండలాల్లో 340 కొనుగోలు కేంద్రాల ద్వారా 33,507 మంది రైతుల ద్వారా రూ.603 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రూ.364 కోట్ల వరకు చెల్లింపులు చేసింది.
రూ.362.74 కోట్లు చెల్లింపు
ఉమ్మడి జిల్లాలో ధాన్యం బాకీలు పేరుకుపో వడంతో అన్నదాతలు కొన్ని రోజులుగా డబ్బు లకు ఎదురుచూస్తున్నారు.మిగిలిన బాకీలు చెల్లిస్తే ఖరీఫ్ సాగుకు డబ్బులు పనికొస్తాయని ఆశించారు. ఈ బాకీలకు సంబంధించి పౌరస రఫరాల సంస్థకు కేంద్రం నుంచి నిధులు రావ డం ఆలస్యమైంది. దీంతో రైతులు పలు చోట్ల ఆందోళనలు చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అన్నదాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్ర బాబు పౌర సరఫరాల సంస్థతో ఇటీవల సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.800 కోట్ల వరకు బాకీలు ఉన్నాయని అధి కారులు వివరించారు. బుధవారం జరిగిన కేబి నెట్ సమావేశంలో ధాన్యం బకాయిలపై చర్చ జరిగింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత లకు తక్షణం రూ.672 కోట్లు తక్షణం చెల్లిం పులు చేయాలని సీఎం ఆదేశించారు.గురు, శు క్రవారాల్లో రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రూ.93.74 కోట్లు, కాకి నాడ జిల్లాలో రూ.80 కోట్లు,కోనసీమ జిల్లా లో రూ.189 కోట్ల వరకు బాకీల చెల్లింపులు జరగ నున్నాయి.మొత్తం 362.74 కోట్లు చెల్లిస్తారు.త ద్వారా రైతులకు ధాన్యం బాకీల బెంగ తీర నుంది. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
24 గంటల్లో సొమ్ము జమ : మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా 30,988 మంది రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లో ధాన్యం సొమ్ము జమ అవుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృ తిక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు అందించిందన్నా రు. పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించార న్నారు.ధాన్యం పాత బకాయిలు వెయ్యి కోట్లకు రూ.672 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
Updated Date - Jul 10 , 2025 | 01:20 AM