ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి
ABN, Publish Date - May 05 , 2025 | 12:28 AM
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను దళారుల పాలు చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల డిమాండ్
అమలాపురం, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను దళారుల పాలు చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అమలాపురంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తే లక్షా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆరోపించారు. దళారులకు ధాన్యం విక్రయించుకుని రైతులు మొత్తం నష్టపోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 12:28 AM