ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వర్రీ తీర్చేనా!

ABN, Publish Date - May 19 , 2025 | 12:39 AM

ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత అవస్థలు పడుతున్నాడు. ఒక పక్క ప్రభుత్వం, మంత్రులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.అది క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు.

ధాన్యం రైతు గట్టెక్కినట్టే

3.4 లక్షల టన్నులు టార్గెట్‌

3.25 లక్షల టన్నులు కొనుగోలు

ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత అవస్థలు పడుతున్నాడు. ఒక పక్క ప్రభుత్వం, మంత్రులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.అది క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. అధికార యంత్రాంగం గతం కంటే ఎక్కువే కొన్నాం.. టార్గెట్లు పూర్తయ్యా యంటూ కొనుగోళ్లను నిలుపుదల చేయడంతో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు.జిల్లాలో మరో 40 వేల టన్నుల ధాన్యం సేకరిస్తే రబీ రైతాంగం గట్టెక్కుతుంది.అంతర్జాతీయ బియ్యం మార్కెట్‌ పడిపోవడంతో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు లేకపోవడంతో జిల్లాలో మిల్లర్లు ధాన్యం కొను గోళ్లు ఆపేశారు. ఈ నేపఽథ్యంలో రైతాంగం అంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలవైపు చూసిన సంగతి తెలి సిందే.దీంతో ధాన్యం సేకరణ సమస్య మొద లైంది.జిల్లాలో సుమారు 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా మొదట్లో ప్రభు త్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా 2.5 లక్షల టన్నుల ధాన్యం సేక రణ లక్ష్యంగా పెట్టు కుంది. మండలాలవారీ లక్ష్యాలు నిర్ణయించి కొనుగోలు చేసింది. కానీ మొదట్లోనే టార్గెట్లు పూర్తి కావడం, అప్పటికి ఇంకా కోతలు పూర్తి కాకపోవడంతో రైతుల ధాన్యం కొనేవాడు కరు వయ్యారు.ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందు లను పసిగట్టిన ఆంధ్ర జ్యోతి వారి పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా యంత్రాం గం, మంత్రులు , ఎమ్మె ల్యేలు స్పందించారు. మరో 90 వేల టన్నుల లక్ష్యం పెంచడంతో రైతులు కుదుట పడ్డారు. అయితే ప్రస్తుతం మరో 40 వేల టన్నుల నుంచి 50 వేల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉండిపోయినట్టు చెబుతున్నారు. కొవ్వూరు డివిజన్‌లో ఎక్కువగా ఉంది. రాజమహేంద్ర వరం డివిజన్‌లో కేవలం అనపర్తి నియోజక వర్గంలో మాత్రమే కొంత మేర ఉన్నట్టు రైతు లు చెబుతున్నారు. బొండాల ధాన్యం కూడా ఉంది. గతంలో మిల్లర్లు ఎక్కువగా బొండాల రకం కేరళకు తోలేవారు. కానీ కేరళలో కూడా ప్రస్తుతం డిమాండ్‌ లేకపోవడంతో కొన్ని మిల్లులు తాత్కాలికంగా మూతపడడం గమ నార్హం. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలో 20 వేల టన్నుల బొండాల ధాన్యం సీఎంఆర్‌ కింద సేకరించింది. మరో 20 వేల టన్నులు సేకరిస్తే మొత్తం సమస్య పరిష్కారమవుతుందని రైతు లు,మిల్లర్లు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 27,949 మంది రైతుల నుంచి 3,24, 319.480 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 746.62 కోట్లు. ఇంతవరకూ రైతుల ఖాతాల్లో రూ.603.62 కోట్లు జమచే శారు. మరో రూ.142.95 కోట్లు జమచేయ డానికి సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేస్తుంది. జూన్‌ నెల నుంచే రైతాంగం ఏరువాకకు సిద్ధం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తే, రైతులు సంతోషంతో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతారు.

పంట వెళ్లినా..ఆన్‌లైన్‌ చేయలేదు..

ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం. చాగల్లు మండలంలో 100 ఎకరాలు వరిసాగు చేశా. అకాల వర్షాల కారణంగా 8 వేల సారలు మిల్లులకు తరలించి 20 రోజులవు తుంది. ఇంకా ఆన్‌లైన్‌ చేయలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. టార్గెట్‌ ఈ రోజు వస్తుంది. రేపు వస్తుంది అంటున్నారు.

- నామాల నరేంద్ర, రైతు,మల్లవరం

పంట కొనడం లేదు..

చాగల్లు మండలం మార్కొండపాడులో 18 ఎకరాలు సాగుచేశా. పంట అమ్ముదామంటే ఆర్‌ఎస్‌కెలో టార్గెట్‌ అయిపోయిందని చెబుతున్నారు. వర్షాలు పడుతున్నందున మిల్లరు సహకారంతో ధాన్యాన్ని మిల్లుకు తరలించా. జేసీ,ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు. ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

- కె.సుబ్రహ్మణ్య రమేష్‌, మార్కొండపాడు

Updated Date - May 19 , 2025 | 12:39 AM