ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీ-4కు సర్వం సిద్ధం

ABN, Publish Date - Jul 09 , 2025 | 01:47 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 8(ఆంధ్రజ్యో తి): పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి పేదవాడిని పైకి తెద్దాం ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగ

ప్రత్తిపాడు ఇందిరాకాలనీలో తాను దత్తత తీసుకున్న రమణ కుటుంబీకులతో మాట్లాడుతున్న కలెకర్ట్‌ షాన్‌మోహన్‌

కొలిక్కి వచ్చిన అర్హుల సర్వే

జిల్లాలో 1.02లక్షల

బంగారు కుటుంబాల గుర్తింపు

మార్గదర్శకులకు అనుసంధానం చేసే దిశగా చర్యలు

ఆగస్టునుంచి పూర్తిస్థాయిలో అమలు

ప్రత్యేక అధికారుల నియామకం

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 8(ఆంధ్రజ్యో తి): పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి పేదవాడిని పైకి తెద్దాం ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దాతల సహకారంతోపాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అన్ని విధాలుగా ఊతమిచ్చి పీ-4ను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో పీ-4కు అర్హత కలిగిన బంగారు కుటుంబాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. మార్గదర్శకుల జాబితా కూడా దాదాపు సిద్ధమైంది. పీ-4 అమలు పర్యవేక్షణకు మండలాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం కూడా జరిగింది. పీ-4 అమలు తీరు తెన్నులకు సంబంధించి తాజాగా అన్ని విభాగాల అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆగస్టు నెల నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. పేదరికం లేని సమాజ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం సదాశయంతో చేపట్టిన పీ4 కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించి ఆదర్శంగా నిలవనున్నారు.

15 అంశాలతో ప్రణాళిక సిద్ధం

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలతోపాటు ప్రజలను భాగస్వాములను చేసి ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి, మౌలిక ఆశయంతో ప్రభుత్వ ఆశయాన్ని, లక్ష్యాన్ని సాకారం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి మిగిలిన వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇందుకనుగుణంగా జిల్లాలోని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలకు అండగా నిలవనున్నారు. గ్రామస్థాయి ఉద్యోగి ఒక కుటుంబాన్ని, మండల స్థాయి ఉద్యోగి రెండు, డివిజన్‌, జిల్లాస్థాయిలో సెంకడ్‌ ఇన్‌ ర్యాంకు ఉద్యోగులు మూడు కుటుంబాలను, జిల్లా అధికారులు ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా అంతా సిద్ధం చేశారు. బంగారు కుటుంబాల జీవన స్థాయి పెంచేందుకు 15అంశాలతో కూడిన జాబితా రూపొందించారు. ఉద్యోగులు ఎంచుకున్న బంగారు కుటుంబాలను మార్గదర్శులు కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయనున్నారు.

జిల్లాలో పూర్తయిన సర్వే

జిల్లాలో చేపట్టిన పీ4 సర్వేలో అధికారులు లక్షా2వేల కుటుంబాలను కడు పేదరికంలో ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ బంగారు కుటుంబాల జాబితాలో చేర్చి పీ4 అమలుపై దృష్టిసారించారు. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులను కూడా మార్గదర్శకుల జాబితాలో చేర్చి ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందేలా వారు చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించారు. వీటితోపాటు బంగారు కుటుంబాలతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని స్వయం సాధికారిత వైపు నడిపించనున్నారు. బ్యాంకుల నుంచి రుణ సదుపాయాలతోపాటు మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణలు ఇచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దీంతో పీ4 ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. పీ4 కార్యక్రమంలో జిల్లా ముందుండాలని కలెక్టర్‌ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.

నేతల పాత్రే కీలకం

పీ4 విజయవంతం కావాలంటే ప్రధానంగా నేతల సహకారమే కావాల్సి ఉంది. ఆయా ని యోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికం గా బలంగా ఉండి సొసైటీకి కొంతైనా తిరిగివ్వాలనే భావన ఉన్నవారెవరో సహజంగా నేతలకే తెలిసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. వీరిని మార్గదర్శకులుగా మార్చడంలో నేతల పాత్రే కీలకం కానుంది. పీ4 అమలును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అమలు పురోగతిపై ఇటీవలే కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అన్ని విభాగాల అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష జరిపారు.

Updated Date - Jul 09 , 2025 | 01:47 AM