ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏం కావాలో తెలుసుకోండి!

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:44 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), జూలై 29 (ఆంధ్ర జ్యోతి): పేదలకు మంచిరోజులొస్తున్నాయి. ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీ4 బంగారు కుటుంబాల దత్తత స్వీకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అసలు పీ4 పరిధిలో ఉన్న బంగారు కుటుంబాల అవసరా

నేటి నుంచి కుటుంబ అవసరాల సర్వే ప్రారంభం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో

పీ4 బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం 2లక్షల19వేలు

ఆగస్టు 15 కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు

కలెక్టరేట్‌ (కాకినాడ), జూలై 29 (ఆంధ్ర జ్యోతి): పేదలకు మంచిరోజులొస్తున్నాయి. ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీ4 బంగారు కుటుంబాల దత్తత స్వీకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అసలు పీ4 పరిధిలో ఉన్న బంగారు కుటుంబాల అవసరాలు ఏంటో తెలుసుకోవడానికి కుటుంబ అవసరాల(నీడ్‌ అసెస్మెంట్‌) సర్వే చేయాలని ప్రభుత్వం సంకల్పి ంచింది. బుధవారం నుంచి ఆ సర్వే ప్రారంభం కానుంది. ఆగస్టు 15వతేదీ కల్లా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

జిల్లాలవారీగా లెక్కలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2లక్షల 19వేల బంగారు కుటుంబాలను దత్తత స్వీక రించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు మార్గదర్శులను గుర్తించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 62వేల బంగారు కుటుంబాలను మార్గద ర్శులను గుర్తించారు. దీనిలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, కార్పొరేట్‌ ఆస్ప త్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌ జీవోలు ఉన్నారు. దీనిలో కాకినాడ జిల్లాలో లక్షా2వేల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం కాగా ఇప్పటి వరకు 35వేల కుటుంబాలను దత్తత స్వీకరించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 60వేల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యంగా నిర్దేశించగా ఇప్ప టివరకు 15వేల కుటు ంబాలను దత్తత స్వీకరణ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 57వేల బంగారు కుటుం బాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 12వేల బంగారు కుటుం బాలను దత్తత స్వీకరించారు. బంగా రు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి కొంతమంది మార్గదర్శులు ముందుకొస్తున్నప్ప టికీ వారి అవసరాలు ఏంటో ముందే తెలుసుకో వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల(నీడ్‌ అసెస్మెంట్‌) సర్వే చేయడానికి సర్వం సిద్ధం చేసింది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ రూపకల్పన చేసింది. ఈ యాప్‌ను ఇప్పటికే కాకినాడ జిల్లా, డాక్టర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాలో ఉద్యో గులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లా ల్లో బుధవారం నుంచి సర్వే ప్రారంభంకానుంది. తూర్పు గోదావరి జిల్లాలో గురువారం నుంచి గానీ, శుక్రవారం నుంచి గానీ ఈ సర్వే చేయనున్నా రు. ఈ జిల్లాలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తు న్నారు.

సచివాలయ ఉద్యోగుల ద్వారా సర్వే

కుటుంబ అవసరాల సర్వే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గ్రామ, వార్డు సచి వాలయం ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వే జరు గుతుంది. ప్రభుత్వం వీరికి ఇచ్చిన ప్రత్యేక యాప్‌ ద్వారా ఆయా బంగారు కుటుంబాల వద్ద కు వెళ్తారు. ఆయా కుటుంబాల అవసరాలను తెలుసుకుని దానిలో నమోదు చేస్తారు. ఉదా హరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారిలో ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవ కాశాలు ఉన్నాయి... వారు ఎలాంటి విద్యార్హత కల్గి ఉన్నారు.. ఎలాంటి ఉపాధి కల్పిస్తే ఆర్థికంగా నిలబడతారు.. వంటి అంశాలు పరిశీలిస్తారు. ఆయా బంగారు కుటుంబాలు ప్రధానంగా ఎలా ంటి సమస్యవల్ల సతమత మవుతున్నా రు వంటి అంశాలను విచారణ చేసి నమోదు చేస్తారు.

వారిపై ప్రత్యేక దృష్టి...

బంగారు కుటుంబాల్లో వితంతువులు, ఒంటరి మహిళలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వీరికి ఇతర కుటుంబసభ్యుల మద్దతు ఉందా లేదా అనే విషయాలను విచారణ చేస్తారు. ఒంటరి మహిళల అవసరాలను తెలుసుకుని యాప్‌లో నమోదు చేస్తారు. పింఛన్‌, ఇతర ఆర్థిక సాయాలు ఏం అందుతున్నాయి వంటి వివరాలు సర్వే ద్వారా తెలుసుకుని నమోదు చేస్తారు.

కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రారంభించిన బంగారు కుటుంబాల దత్తతకు జిల్లాలో కార్పొరేట్‌ సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రు లు, పరిశ్రమల యాజమాన్యం, గ్యాస్‌ ఏజెన్సీలు, హేచరీలు, పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ముందుకు రావాలి. ఎన్‌జీవోలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించాలి. దీని వల్ల పేదలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. బంగారు కుటుంబాల మార్గదర్శకులు దత్తత స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది.

- కాకినాడ జిల్లా కలెక్టర్‌, షాన్‌మోహన్‌

Updated Date - Jul 30 , 2025 | 12:44 AM