ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్‌ కగార్‌ రాజ్యాంగ విరుద్ధం

ABN, Publish Date - May 03 , 2025 | 01:31 AM

భారత రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్రె గుట్ట ఆపరేషన్‌ కగార్‌ను తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు ధర్నా చేశాయి. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ సమీపం లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకుడు పల్లా వెంకటనాయుడు, పౌరహక్కుల సం ఘం రాష్ట్ర నేత, సుప్రీంకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ, ఎం.దుర్గాప్రసాద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ప్రగతి శీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ మాట్లాడారు.

గోకవరం బస్టాండ్‌ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు
  • తక్షణం నిలుపుదల చేయాలి

  • సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల ధర్నా

రాజమహేంద్రవరం సిటీ, మే 2(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్రె గుట్ట ఆపరేషన్‌ కగార్‌ను తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు ధర్నా చేశాయి. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ సమీపం లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకుడు పల్లా వెంకటనాయుడు, పౌరహక్కుల సం ఘం రాష్ట్ర నేత, సుప్రీంకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ, ఎం.దుర్గాప్రసాద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ప్రగతి శీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ మాట్లాడారు. కార్పొరేట్లకు ఖనిజ సంపద కట్టబెట్టడానికి జరుగుతున్న ఆపరేషన్‌ ఇదని అన్నా రు. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం అరెస్టు చేస్తే న్యాయస్థానాలు శిక్షిస్తాయి తప్ప ఆపరేషన్‌ పేరుతో భారత పౌరులను చంపరాదని అన్నా రు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపడాన్ని ఖండిస్తున్నామన్నారు. అమాయకులను చంపడంలో ఉగ్రవాదులకు, మోదీ ప్రభుత్వానికి పెద్దతేడా లేదన్నారు. తక్షణమే ఆపరేషన్‌ కగార్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. మవోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేసారు. ఈ ధర్నాలో ఆర్‌పీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనాల లాజరు, ఐఎఫ్‌టీయూ నాయకులు ఏసుకుమార్‌, రాఘవులు, పవన్‌, ఏఐకేఎంఎస్‌ నాయకులు సత్తిబాబు, పి.సో మన్న, పాపన్న, ఎం.రాజు, ఈమని మల్లిక, గెడ్డం రవీంద్రబాబు, పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 01:31 AM