ఉల్లి..లొల్లి!
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:44 AM
ఉల్లి ధరలు మళ్లీ పరుగుపెడుతున్నాయి. మిగిలిన కూరగాయల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ ఉల్లిపాయల ధర మాత్రం పెరుగుతోంది.
10 రోజుల్లో కిలోకి రూ.5 పెంపు
ప్రస్తుతం కిలో రూ.29
మరింత పెరిగే అవకాశం
నిలకడగా కూరగాయల ధరలు
కార్పొరేషన్(కాకినాడ), జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధరలు మళ్లీ పరుగుపెడుతున్నాయి. మిగిలిన కూరగాయల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ ఉల్లిపాయల ధర మాత్రం పెరుగుతోంది. ఈనెల 9వ తేదీకి కిలో ధర రూ.24 ఉండేది. తర్వాత హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర పెరిగింది. దీంతో క్రమంగా రైతు బజారులో కూడా ఉల్లి ధర రూ.24 నుంచి రూ.29 చేరింది. రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి తడిసి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కె ట్‌కు తక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ఉల్లి ధర పెర గడం ప్రారంభించింది. బస్తా (50 కిలోలు) నాణ్యమైనవి రూ.1200కు విక్రయిస్తున్నారు. గత నెల వరకు ఈ రకం రూ.1000కే విక్రయించేవారు. ఇప్పుడు నాణ్యమని చెప్పే ఉల్లి కూడా నిల్వకు ఆగదని వ్యాపారులే చెబుతున్నారు. గతంలో తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు వ్యాపారులే నేరుగా తాడేపల్లిగూడెంతో సంబంధం లేకుండా పశ్చిమ బెంగాల్‌కు ఎగుమతి చేసేస్తున్నారు. ధర పెరగడానికి ఇది కూడా కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఇక అల్లం ధర దిగొచ్చింది. గత సంవత్సరం ఇదే సమయానికి కిలో రూ.140 నుంచి 200 పలికింది. ప్రస్తు తం కిలో రూ.50కే లభిస్తుంది. కొత్త ప్రాంతాల్లో అల్లం సాగుచేయడం వల్లే ధర తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. పచ్చిమిర్చి ధర భారీగా పడిపోయింది. పది కిలోల మిర్చి హోల్‌సేల్ రూ.200కే విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు గత వారంతో పోలిస్తే నిలకడగానే ఉన్నాయి. టమోటా ధర గత నెల కిలో రూ.13 విక్రయించగా ప్రస్తు తం కిలో రూ.5 అదనంగా పెరిగి రూ.18కి విక్రయిస్తున్నా రు. మిగిలిన కూరగాయల ధరలు నిలకడగానే ఉన్నాయి.
Updated Date - Jun 21 , 2025 | 01:47 AM