ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

24 గంటల్లో దొంగను పట్టేశారు

ABN, Publish Date - May 21 , 2025 | 12:17 AM

అన్నవరం, మే 20 (ఆంధ్రజ్యోతి): రూ.10 లక్షల చోరీ కేసులో నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని బాధితుడికి నగదును అందజేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన బోడపాటి నాగేశ్వరరావు సోమవారం కాకినాడ జిల్లా తునిలో ఉన్న తన స్థలం విక్రయించి అడ్వాన్స్‌ రూపంలో రూ.10 లక్షలు నగదు, మరో

అన్నవరంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ సూరిఅప్పారావు

రూ.10 లక్షలు చోరీ

అన్నవరంలో నిందితుడి అరెస్ట్‌

అన్నవరం, మే 20 (ఆంధ్రజ్యోతి): రూ.10 లక్షల చోరీ కేసులో నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని బాధితుడికి నగదును అందజేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన బోడపాటి నాగేశ్వరరావు సోమవారం కాకినాడ జిల్లా తునిలో ఉన్న తన స్థలం విక్రయించి అడ్వాన్స్‌ రూపంలో రూ.10 లక్షలు నగదు, మరో రూ.10 లక్షలు చెక్‌ ద్వారా తీసుకున్నాడు. నగదును బ్యాగ్‌లో పెట్టుకుని తుని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కి అన్నవరంలో దిగాడు. అయితే అత ని దృష్టిమరల్చి బ్యాగ్‌ కత్తిరించి నగదుతో నిందితుడు ఉడాయించాడు. దీంతో చోరీ జరిగిందని గ్రహించిన నాగేశ్వరరావు అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పెద్దాపురం డీఎస్పీ ఆదే శాలతో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంకబాబు, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావులు నాలుగు టీంలు గా విభజించి దర్యాప్తు చేపట్టగా అన్నవరం జాతీయ రహదారిపై మండపం సెంటర్లో అను మానాస్పదంగా తిరుగుతున్న విశాఖపట్నానికి చెందిన కంబాల శ్రీనును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నగదు తస్కరించుకున్నట్టు అంగీకరించడంతో అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ తెలిపారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టులో ప్ర వేశపెట్టినట్టు చెప్పారు. దొంతనం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పెద్దాపురం సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంకబాబు, ఏఎస్‌ఐ బలరాం, హెచ్‌సీ రాధాకృష్ణలను డీఎస్పీ అభినందించారు.

Updated Date - May 21 , 2025 | 12:17 AM