ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షణాల్లోనే కొనేస్తాం!

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:26 AM

పాత ఇనుము దుకాణాలు.. గతంలో అరకొరగా అక్కడక్కడా ఉండేవి. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా పాత ఇనుము దుకాణాలు విస్తరిస్తున్నాయి. దుకాణల

పాత ఇనుము కొట్టుకు చేరిన పాత ఇంజన్లు, సామాగ్రి

ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్నపాత ఇనుము వ్యాపారం

ఖరీదైన కార్లు, బైకులను సైతం

విడగొట్టి పార్టుల అమ్మకం

పంట పొలాల్లో చేతిపంపులు,

ఇనుప వస్తువులు మాయం

పాత ఇనుము దుకాణాలపై

కొరవడిన నిఘా

రావులపాలెం-ఆంధ్రజ్యోతి

పాత ఇనుము దుకాణాలు.. గతంలో అరకొరగా అక్కడక్కడా ఉండేవి. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా పాత ఇనుము దుకాణాలు విస్తరిస్తున్నాయి. దుకాణల వద్దకు ఏ వస్తువు తీసుకువచ్చినా వెంటనే కొనుగోలు చేసేస్తున్నారు. దీంతో ఈ దుకాణాల వద్దకు ఖరీదైన కార్లు, బైకులు, ఇంజన్లు పాత ఇనుప సామాగ్రి, ఇత్తడి, రాగి వైర్లు, స్టీల్‌ సామాన్లు సైతం దుకాణాలకు చేరిపోతున్నాయి. వాటిని పెద్ద మొత్తంలో లారీల్లో ఎగు మతి చేసి విక్రయించి దుకాణాదారులు సొమ్ము లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చోరీ చేసిన సామాన్ల కొనుగోళ్లు భారీగా జరుగుతున్నట్టు సమాచారం.

ప్రధాన నగరాల్లో దుకాణాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో వశిష్ట వంతెన నుంచి గౌతమి వంతెన వరకూ 10 కిలోమీటర్ల మేర జా తీయ రహదారి విస్తరించి ఉంది. ఈ ఒక్క ప్రాం తంలోనే పదుల సంఖ్యలో పాత ఇనుము దుకాణాలు వెలిశాయి. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా ప్రధాన రహదారుల చెంతన గ్రామాల్లో సైతం పాత ఇనుము దుకాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడతోపా టు పలు నగరాల్లోను ఈ తరహా దుకాణాలు ఉన్నాయి. తెల్లవారింది మొదలు సాయంత్రం వరకూ పాత ఇనుము కొనుగోలు చేసే ఆటోలు హోరెత్తిస్తున్నాయి. ఈ భారీ శబ్దాలతో ఆటోల బాదుడు భరించలేకపోతున్నామంటూ పలువురు వాపోతున్నారు. ఒక్కో పాత ఇనుము దుకాణంవద్ద రెండు నుంచి ఐదు పాత ఇనుము కొనుగోలు చేసే ఆటోలు దర్శనమిస్తున్నాయి. వాటిని లైసెన్సులేని కూడా యువకులు అద్దెకు తీసుకుని గ్రామాల్లో పాత ఇనుము కోసం తిరుగుతూ కొనుగోలు చేస్తున్నారు. ఆటోలకు సరైన రికార్డులు కూడా ఉండడంలేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

పాత బైకులకు మార్పులు

కొన్ని దుకాణాల్లో పాత బైకులకు ఆటో సెల్ఫ్‌తో ఉన్న ఇంజన్లు సైతం రూ.10వేల నుంచి రూ.14వేల వరకూ విక్రయిస్తుండడంతో వినియోగదారులు కూడా తమ పాత బైకులకు సెల్ప్‌ ఇం జన్లను మార్పు చేసుకుంటున్నారు. కారైనా, బైక్‌ అయినా, ఏ వస్తువైనా పాత ఇనుము దుకాణం వద్దకు చేరుకోగానే క్షణాల్లో అక్కడ ఉన్న సిబ్బ ంది గ్యాస్‌ కట్టర్లు, రెంచుల సైతం విడిపార్టులుగా మార్చేస్తారు. ఎంత పెద్ద వాహనమైనా ఇక్కడికి వచ్చిందంటే కట్‌ చేసి స్ర్కాబ్‌లోకి క్షణాల్లోకి వెళ్లాల్సిందే. పాత ఇనుము దుకాణాలకు ఎవరైనా అ మ్మినా సామాగ్రి వస్తుందా.. లేదా వేరే మార్గాల్లో ఇక్కడికి చేరుతుందా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీటిపై అధికారుల నిఘా పూర్తిస్థాయిలో కొరవడడంతో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాలువ గట్టుచెంతన పంటపొలాల్లో ఉన్న చేతి పంపులు మాయమవుతున్నాయి. అవి పంచాయతీకి ఆర్‌డబ్ల్యూఎస్‌కి చెందనవి కావడంతో మళ్లీ వారే వేస్తారులే అని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదు. కోనసీమ జిల్లాలో గతేడాది వేసవిలో ఎన్ని చేతిపంపులు బిగించారో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలు సేకరిస్తే ఎన్ని మాయమయ్యాయే వాస్త వం తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే పాత ఇనుము దుకాణదారులు అధికారులకు నెలవారీగా మామూళ్లు ముట్టచెబుతున్నారంటూ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

క్యూ కడుతున్న వినియోగదారులు

ఇక పాత ఇనుము దుకాణాల్లో గుండు సూది మొదలుకొని నీరు తోడే ఇంజన్లు, కార్లు, బైకులు, బైకుల విడిపార్టులు, గృహానిర్మాణానికి వినియోగించే ఇనుప ఊచలు, గేట్లు, గునపాలు పారలు, రేకులు, చేతిపంపులు, బకెట్లు, ఇత్తడి సామాగ్రి, రాగి వైర్లతోపాటు స్టీల్‌ సామ న్లు సైతం కనిపిస్తున్నాయి. ఈ సామాన్లు ఎక్కడ కొనుగోలు చేశారు. ఎవరూ విక్రయించారో అని అడిగేవారే లేకపోవడంతో కొన్ని దు కాణాల్లో కొత్త పరికరాలు సైతం పాత ఇనుము దుకాణాల్లో లభ్యమవుతుండడం తో వినియోగదారులు మెకానిక్‌లు ఆటోమొబైల్‌ షాపుల కంటే పాత ఇనుము దుకాణాల్లోనే విడిపా ర్టు లు కొనుగోలుచేసేందుకు క్యూ కడుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:26 AM