అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN, Publish Date - May 07 , 2025 | 12:58 AM
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు.
కొత్తపేట, మే 6(ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. మంగళవారం స్ధానిక బండారు బల్లిసత్యం, చంద్రావతి కల్యాణ మండపంలో అన్ని శాఖల ఽఅధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లోవోల్టేజీ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఒక్క అధికారి తమశాఖ పరిధిలో ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్తిబాబుగౌడ్, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:59 AM