ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గొంతెండదంతే!

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:35 AM

వేసవి వస్తే చాలు..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పల్లె గొంతులు తాగునీటి కోసం అలమటించే పరిస్థితి. చెంతనే గోదావరి ఉన్నా.. అందుబాటులో మంచినీటి ట్యాంకులు ఉన్నా జనం దాహార్తిని తీర్చలేని దుస్థితి..

సీపీడబ్ల్యూ ట్యాంకులు

తాగునీరందేలా సర్కారు చర్యలు

64 సీపీడబ్ల్యూ ట్యాంకులపై దృష్టి

రూ.66 కోట్ల నిధులు మంజూరు

పనులకు టెండర్ల ఆహ్వానం

ఈనెల 28వ తేదీ తర్వాత ఖరారు

తీరనున్న తాగునీటి వెతలు

ఏడాదిపాటు పనుల నిర్వహణ

గతంలో పట్టించుకోని వైసీపీ

నాడు ట్యాంకులన్నీ నిరుపయోగం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

వేసవి వస్తే చాలు..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పల్లె గొంతులు తాగునీటి కోసం అలమటించే పరిస్థితి. చెంతనే గోదావరి ఉన్నా.. అందుబాటులో మంచినీటి ట్యాంకులు ఉన్నా జనం దాహార్తిని తీర్చలేని దుస్థితి.. ఏటా ఇదే తంతు.. అయినా గత వైసీపీ సర్కారు ఇదేదీ పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఒక్కోటీ గాడిన పడుతున్నాయి. వేసవి రావడంతో జనం గొంతెండే పరిస్థితులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.66 కోట్లతో సమ గ్ర రక్షిత మంచినీరు పల్లెలకు అందేలా కార్యా చరణకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 66 సీపీడబ్ల్యూ స్కీం పనులకు సంబంధించి మర మ్మతులు, నిర్వహణ పనులకు టెండర్లు పిలి చింది. ఈవారంలోగా వీటిని పూర్తి చేసి పను లు పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది.

దాహార్తి తీరినట్లే..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి సమగ్ర రక్షిత మంచినీటి పథకం కింద ఎన్నో ఏళ్ల కిందట ప్రభుత్వం భారీ మంచినీటి ట్యాంకులను నిర్మిం చింది. సమీప గోదావరి కాలువలు, చెరువులు, కాలువల్లో నీటిని ఈ ట్యాంకులకు అనుసం ధానం చేసి అక్కడే శుద్ధిచేసి గ్రామాల్లో ఇళ్లకు పైపులైన్ల ద్వారా కుళాయిలకు నీటిని ఆ శాఖ అధికారులు స్థానిక పంచాయతీల సాయంతో అందించేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తాగునీటి సరఫరాను పూర్తిగా గాలికొ దిలేసింది. దీంతో వేసవి వస్తే చాలు ఉమ్మడి జిల్లాలో అనేక పల్లెలు దాహార్తితో అల్లాడేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ వ్యవస్థను అధికారులు గాడినపెట్టేందుకు చర్య లు చేపట్టారు. వేసవి ముదరడం.. గ్రామాల్లో దాహార్తి పెరగడంతో మూలనపడ్డ, నిర్వహణకు నోచుకోకుండా ఉన్న సీపీడబ్ల్యూ ట్యాంకులకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఆర్థిక సంఘం నిధులు ఇతర అవసరాలకు మళ్లించకుండా మంచినీటి ట్యాం కుల మరమ్మతు, నీటిశుద్ధి, పైపులైన్లకు రిపేర్లు వంటివాటికే వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశిం చిది.దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.66 కోట్లతో వీటన్నింటికి మరమ్మతు, నిర్వహణకు వీలుగా అధికారులు తాజాగా టెండర్లు పిలిచారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.

ఏడాదిపాటు ఇబ్బంది లేకుండా..

కాకినాడ జిల్లాలోని ట్యాంకుల మరమ్మ తులు, గోదావరి కాలువల నుంచి ట్యాంకులకు వెళ్లే పైపులైన్లు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల నిర్వహణ తదితర అవసరాలకు రూ.25 కోట్లు వెచ్చించనున్నారు. కోనసీమ జిల్లా మలికి పురంలోని గుడిమెల్లంక స్కీమ్‌కు రూ.78.05 లక్షలు, కొత్తపేట, రావులపాలెం మండలాలకు రూ.77.86 లక్షలు, అంతర్వేదిపాలెం రూ.53.87 లక్షలు, ముమ్మిడివరం రూ.49.66 లక్షలు, ఉప్పలగుప్తం రూ.46.75 లక్షలు, కాట్రేని కోనలోని కందికుప్ప స్కీమ్‌కు రూ.44.05 లక్షలు, ఆత్రేయపురం రూ.36.98 లక్షలు, అమలాపురంలోని బోడసకుర్రుకు రూ.42.90 లక్షలు, పి.గన్నవరం రూ.33.48 లక్షలు, గోడి రూ.36.01 లక్షలు, పేరూరు రూ.28.23 లక్షలు, మురమళ్ల రూ.28 లక్షలు, కాకినాడ జిల్లా నాగు లాపల్లి రూ.46.89 లక్షలు, జగ్గంపేట రూ.46.53 లక్షలు, సూర్యారావుపేట రూ.45 లక్షలు, తునిలోని ఏవీ నగరం స్కీమ్‌కు రూ.43.75 లక్షలు, తాళ్లరేవు మండలం పటవల రూ.33.47 లక్షలు, తాళ్లరేవు రూ.32.90 లక్షలు, పెదపూడి రూ.30.93 లక్షలు, ఏలేశ్వరం రూ.43.30 లక్షలు, గొల్లప్రోలు రూ.29.23 లక్షలు, గండేపల్లి రూ. 26.92 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలోని కోరు కొండలోని బూరుగుపూడి స్కీ మ్‌కు రూ.40.74 లక్షలు, చాగల్నాడు రూ.30.10 లక్షలు, అనపర్తి లోని కాపవరం స్కీమ్‌కు రూ.28.79 లక్షలు, కడియం పరిసర గ్రామాలకు రూ.76.77 లక్షలు, ఏజెన్సీలోని వై.రామవరం రూ.31.15 లక్షలు, కూనవరం రూ.26.71 లక్షల చొప్పున ఆయా స్కీమ్‌ ట్యాంకులకు నిధులు కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం మారిన తర్వాత తాగునీటి బెంగ తీరబోతోంది. మరమ్మతులతోపాటు ఏడాదిపాటు వీటికి ఏ సమస్యా లేకుండా నిర్వ హణ బాధ్యత కూడా ఆయా కాంట్రాక్టర్లదే.

Updated Date - Apr 22 , 2025 | 12:35 AM