ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉన్నా ఉపయోగమేదీ!

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:21 AM

గోకవరం మండలంలో సుమారు ఆరు వేల హెక్టార్లలో అధికంగా వరి పంట సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరే ఈ పంటలకు ఎక్కువ ఆధారం. అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న ము సురుమిల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు, గంగవరం మండలంలో ఉన్న సూ రంపాలెం ప్రాజెక్టు నుంచి సుమారు 5వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. వీటితోపాటు పుష్కర కాలువ నుంచి మరో 3000 ఎకరాలకు సాగునీరు పంట పొలాలకు వచ్చి చేరుతుంది.

నిర్వహణకు నోచుకోని సూరంపాలెం కాలువ
  • నేటికీ పూర్తికాని 12వ కుడి కాలువ పనులు

  • ఎక్కడికక్కడ పూడిక

  • సాగునీరు అందక ఇక్కట్లు

  • హెడ్‌ వర్క్స్‌ పనులకు ముసురుమిల్లి ఎదురుచూపులు

గోకవరం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): గోకవరం మండలంలో సుమారు ఆరు వేల హెక్టార్లలో అధికంగా వరి పంట సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరే ఈ పంటలకు ఎక్కువ ఆధారం. అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న ము సురుమిల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు, గంగవరం మండలంలో ఉన్న సూ రంపాలెం ప్రాజెక్టు నుంచి సుమారు 5వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. వీటితోపాటు పుష్కర కాలువ నుంచి మరో 3000 ఎకరాలకు సాగునీరు పంట పొలాలకు వచ్చి చేరుతుంది. అయితే వీటిలో సూరంపా లెం ప్రధాన కాలువ పరిస్థితి చాలా అధ్వానం గా ఉంది. నేటికీ 12వ కుడి కాలువ పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడంలేదు. కాలువలో ఎక్కడికక్కడ పూడిక పేరుకుపోయి కనీసం నీరు పారని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గంగ వరం, గోకవరం, కోరుకొండ మండలాలకు చెం దిన పొలాలకు నీరు చేరాల్సి ఉంది. పూడిక నిండి పోవడం వల్ల కాలువలో వదిలిన నీరు చివరి వరకు చేరడం లేదు.ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాధారంతో రైతులు నెట్టి కొచ్చినప్పటికీ సాగు తుది దశకు చేరుకునే సరికి రైతుల కు సాగునీరు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది ఖరీఫ్‌లోను ఇదే విధమై న పరిస్థితులు తలెత్తి రైతులు తీవ్రంగా నష్టపో యారు. కాలువ పూడిక పనులు చేపట్టి సాగు నీరు అందించాలని ఎప్పటి నుంచో రైతు లు వేడుకుంటున్నా ఆ దిశగా పనులు ముం దుకు సాగడం లేదు. ఇటీవల ప్రాజెక్టు పరిస్థి తిని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకె ళ్లడంతో ఆయన వెంటనే సానుకూలంగా స్పం దించి సాగునీరు అందేలా చర్యలు తీసుకుం టానని రైతులకు భరోసా ఇచ్చారు. ఇంకో పక్క ముసురుమిల్లి ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ పనులు పూర్తికాక గోకవరం మండలంలోని పలు గ్రా మాల రైతులు ఇబ్బందులు చవి చూస్తున్నారు. 2004 సంవత్స రంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డి నిర్మాణ ప నులకు శంకు స్థా పన చేయగా 20 06లో పనులు ప్రారంభించారు. ఇప్పటికి 20 సం వత్సరాలు గడిచిన ప్పటికీ హెడ్‌ వర్క్స్‌ పనులు కొలిక్కి రాకపో వడంతో ముసురుమిల్లి ప్రా జెక్టు ఇంకనూ రైతులకు వినియోగం లోకి రాలేదు. సుమారు రూ.182 కోట్లతో చేప ట్టిన ఈ ప్రాజెక్టు పనులకు మరో రూ.9 కోట్లు వెచ్చిస్తే నిర్మాణపు పనులు తుది దశకు చేరు కుంటాయని ఇక్కడి రైతాంగం అంటోంది. వీటి తోపాటు మండలంలోని కొన్ని చోట్ల కాలువ గట్లు, పిల్ల కాలువలను పటిష్టం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:21 AM