ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జాగునికీకరణ!

ABN, Publish Date - May 17 , 2025 | 01:14 AM

కాలువలు కట్టేశారు.. అప్పుడే 20 రోజులైపోయింది.. అయినా కాల్వల ఆధునికీకరణ ఊసేలేదు.. దీంతో ప్రస్తుతం కాలువలు అధ్వానంగా ఉన్నాయి.

కుచించుకుపోతున్నాయి : కడియం వద్ద కాలువను కప్పేసిన డంపింగ్‌యార్డ్‌..

పూడుకుపోయిన కాల్వలు

ఎక్కడికక్కడ శిథిలమైన లాకులు

గత ఐదేళ్లూ పట్టించుకోని వైసీపీ

కూటమిలోనూ అరకొరే నిధులు

నేటికీ ఆరంభం కాని పనులు

కాల్వలు కట్టేసి 20 రోజులు

మరో పది రోజుల్లో నీరు విడుదల

ఎక్కడి సమస్యలు అక్కడే

రాజమహేంద్రవరం/అమలాపురం/పి.గన్నవరం-ఆంధ్రజ్యోతి

కాలువలు కట్టేశారు.. అప్పుడే 20 రోజులైపోయింది.. అయినా కాల్వల ఆధునికీకరణ ఊసేలేదు.. దీంతో ప్రస్తుతం కాలువలు అధ్వానంగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వమైనా ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ (ఓఅండ్‌ ఎం) పేరుతో ప్రతి ఏటా కాలువల క్లోజర్‌ సమయంలో ఆధునికీకరణ పనులు చేపట్టాలి. వైసీపీ హయాంలో అసలు పట్టించుకోలేదు. 2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన పంట కాల్వలను అభివృద్ధి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈసారి మొత్తం పనులపై దృష్టి పెట్టాలని భావించింది. ఈ మేరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 33 నియోజకవర్గాల్లో రూ.68.64 కోట్లతో 1,747 పనులు చేయాలని ప్రతిపాదన పంపారు. రాష్ట్ర కేబినెట్‌లో రూ.35.8 కోట్లతో 877 పనులు మంజూరు చేశారు. కోనసీమ జిల్లా పరిధిలో 452 పనులకు 18.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా వర్కులు విభజించి కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే వీటిలో కాలువల పూడికతీత, తూడు తొలగింపు, షట్టర్ల మరమ్మతులు వంటి చిన్నపనులు మాత్రమే ఉన్నాయి.

లాకులు.. కూలిపోతున్నాయి..

మండపేట, మే16(ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ పరిఽధిలో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరాయి. మరోపక్క అసంపూర్తిగా మిగిలిన ఇరిగేషన్‌ భవనాలు, పంట కాల్వలపై వంతెనలు నేటికీ 13 ఏళ్ల నుంచి ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా పంట కాల్వలు ఆధునికీకరణ, తూడు తొలగింపు పనులు చేసేందుకు రూ.2 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిం ది. దాంతో డివిజన్‌ పరిధిలో తాపేశ్వరం, రామచంద్ర పురం, ద్రాక్షారామ, జగన్నాఽథగిరి ఇరిగేషన్‌ సెక్షన్ల పరి ధి పంట కాల్వల్లో తూడు తొలగింపు, పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది. ఆయా సెక్షన్ల పరిధిలో 16 సాగునీటి సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారా ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టనున్నారు.

తుప్పుపట్టిన లాకులు..

కడియం : కడియం కెనాల్‌పై లాకులు తుప్పుపట్టి లీకులు కారుతున్నాయి. కడియంలో కాకినాడ, రామచంద్రపురం డివిజన్లకు సంబందించిన లాకు ఉన్న 7 తలుపుల్లో 1,4 తలుపులు పూర్తిగా తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడ్డాయి. గేట్ల ఎవరూ పట్టించుకోక పోవడంతో లాక్‌ తలుపులు తుప్పుపట్టి పాడైపో యాయి.దీంతో నీరు వృథాగా పోతోంది.

లొల్ల లాకులు..శిథిలం

ఆత్రేయపురం : సెంట్రల్‌ డెల్టా ఆయువు పట్టు లొల్ల లాకులు శిథిలస్థితికి చేరాయి. అఖండ గోదావరి నుంచి బొబ్బర్లంక ప్రధాన కాలువ ద్వారా లొల్లలాకుల వద్ద మూడు కాలువలుగా విడిపోయి 16 మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తుంది. అమలాపురం, ముక్తేశ్వరం, గన్నవరం కాలువల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆధునికీకరణ పనుల ఊసే లేదు. షట్టర్ల మరమ్మతులకు నిధుల్లేవ్‌.. కాలువల వద్ద అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు దెబ్బతిన్నాయి. ఈ వేసవిలో ఆధునికీకరణ పనులకు రూ.60 లక్షలు ప్రతిపాదనలు పంపించారు. స్లూయిజ్‌ మరమ్మతులకు రూ.4.10 లక్షలు నిధులు మంజూరయ్యాయి. లాకుల నిర్వహణకు నిధులివ్వాల్సి ఉంది.

చానల్స్‌ ఉన్నా నీళ్లు రావు

అనపర్తి : అనపర్తి పరిధి సామర్లకోట కాలువలో ఉన్న ఏడు చానల్స్‌లో ఏ ఒక్కటీ సరైన రీతిలో లేక రైతులు సాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా అనపర్తి ఎర్రకాలువ వంతెన సమీపంలో ఉన్న నెం 3 సైడ్‌ చానల్‌ నుంచి మొత్తం 2016 ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే సైడ్‌ వాల్స్‌ కూలి అవసారానికి సాగు నీరందని పరిస్థితి ఏర్ప డింది.కాలువలకు నీరు విడుదల చేసే లోపు చానల్స్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది.

శిథిలమైన ట్రఫ్‌

మలికిపురం, మే 16(ఆంధ్రజ్యోతి): మలికిపురం నీటి సంఘం పరిధిలోని గుడిమెల్లంక వంతెన వద్ద మోరికాల్వపై ట్రఫ్‌ శిథిలమై సాగునీరంతా వేపచెట్టు డ్రెయిన్‌లోకి పోతుంది. ఈ ఏడాది వేసవి కాల్వలు క్లోజర్‌ పిరియడ్‌లో నిధులు మంజూరు చేస్తారని, ట్రఫ్‌ నిర్మాణం జరుగుతుందని రైతుల కష్టాలు గట్టెక్కుతాయని ఆశించారు. అయితే ఈ ఏడాది కూడా ట్రఫ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. రూ.50 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.

అరకొర పనులతో సరి..

కొత్తపేట : ఈ సారి అరకొర పనులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు ఇరిగేషన్‌ సెక్షన్లు ఉండగా కొత్తపేట- ముక్తేశ్వరం కాలువ పరిధిలో వాడపాలెం వద్ద రూ.10 లక్షలతో రిటైనింగ్‌ వాల్‌, పలివెల- అమలాపురం కాలువ అవిడి వద్ద రూ.9 లక్షలతో ఒక రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చే పట్టనున్నారు. డ్రెయిన్ల పూడికతీత చేపట్టనున్నారు.

పంట కాల్వలు అధ్వానం

అంబాజీపేట : పంటకాల్వలు ఆధ్వానంగా మారాయి. ముక్కామల నుంచి పుల్లేటికుర్రు, వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, అవిడి, ఇసుకపూడి, ముక్కామల, గంగలకుర్రులో పంటకాలువలు ఉన్నా యి. ముక్కామల వెస్ట్‌ కాలువ నుంచి గత కొన్నేళ్ల గా పంట పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. మాచవరంలో ఉన్న పంటకాలువ గుర్రపుడెక్కతో మూసుకుపోయింది.

చెత్త..చెత్తగా కాల్వలు

మామిడికుదురు : ప్రధాన పంటకాల్వలన్నీ మురికి కాల్వలను తలపిస్తున్నాయి. పెదపట్నం నుంచి మగటపల్లి వరకు, నగరం నుంచి ఈదరాడ వరకు గల ప్రధాన పంటకాల్వలన్నీ చెత్తతో దర్శన మిస్తున్నాయి. కాల్వల ఆధునికీకరణ పనులు చేప ట్టకపోవడంతో అధ్వానంగా ఉన్నాయి.

ఆధునికీకరణ పనులేవీ..

అయినవిల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): అయినవిల్లి-విలస పరిధిలో 60 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఆధునికీకరణ పనులు నేటికీ ఆరంభం కాలేదు. అయినవిల్లి-విలస కాల్వలో పూడికతీతకు 7 కి.మీ రూ.3 లక్షలు, జీసీ బ్యాంక్‌ కెనాల్‌ 23 కి.మీ నుంచి 30 కి.మీ రూ.5 లక్షలు, 30 కి.మీ నుంచి 39 కి.మీ అయినవిల్లి-కొత్తపేట పరిధిలో రూ.5లక్షల వ్యయంతో పనులను నీటిపారుదల శాఖ నిర్వహించాల్సి ఉండగా నేటికీ పనులు ప్రారంభించలేదు.

Updated Date - May 17 , 2025 | 01:14 AM