వానోకాలం!
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:54 AM
రుతుపవనాలు విస్తరించి చాలా వారాలు అవుతున్నా వీటి ప్రభావం ఈసీజన్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఈపాటికే వర్షాలు ఎక్కడికక్కడ భారీగా కురవాల్సి ఉండగా చినుకుల జాడే కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో వర్షపాతం అరకొరే
కాకినాడ, తూర్పున సాధారణం
కోనసీమలో 15 మండలాల్లో లోటు
గతేడాది జూన్‌లో భారీ వానలు
ఈ ఏడాది చూస్తే కానరాని జాడ
ఆందోళనలో రైతాంగం
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
రుతుపవనాలు విస్తరించి చాలా వారాలు అవుతున్నా వీటి ప్రభావం ఈసీజన్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఈపాటికే వర్షాలు ఎక్కడికక్కడ భారీగా కురవాల్సి ఉండగా చినుకుల జాడే కనిపించడం లేదు. పేరుకు ఆకాశంలో దట్టమైన మేఘాలు ఆవహించి భారీ కుండపోత వాన ఏక్షణమైనా కురుస్తుందన్నట్టు ఉంటున్నా తీరా గాలులు తప్పించి వాన జాడ ఉండడం లేదు. అటు దట్టమైన మేఘాల వల్ల వాతావరణం చల్లబడాల్సి ఉన్నా దీనికి భిన్నంగా ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా వర్షపాతం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో చినుకు జాడ కరువైంది.. రుతు పవనాలు వచ్చే సినా వరుణుడి జాడ కానరావడం లేదు.. దట్టమైన మేఘాలు ఆవరించినా గాలులే తప్ప చుక్క చినుకు రాలడం లేదు.. ఈ పాటికే భారీ వర్షాలతో జిల్లాలో అదనపు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు సాధారణ వర్షపాతంతోనే నెట్టుకొస్తున్నాయి. అటు కోనసీమ జిల్లా లోటు వర్షపాతంతో కలవరపాటుకు గురవుతోంది. గతేడాది ఈ పాటికే వానలు దంచి కొట్టాయి.ఈ సారి జూన్ నుంచి ఈ నెల జూలైలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాల్లేకపోవడం అన్నదాత లను కలవరపాటుకు గురిచేస్తోంది.
కాకినాడలో లోటు
కాకినాడ జిల్లాలో మొత్తం 21 మండలాలకు 18 మండ లాల్లో సాధారణ వర్షపాతమే కొనసాగుతోంది. మూడు మండలాల్లో అవ సరానికి మించిన వాన నమోదైంది. అం దులో గొల్లప్రోలు మం డలం జిల్లాలో అన్నింటికంటే అద నపు వర్షపాతంతో కొనసాగు తోంది.ఇక్కడ గడచిన 40 రోజుల్లో 66.17 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 106.11 మి.మీ. కురిసింది.కోట నందూరులో 103.07 మి.మీ.లకు 173.97 మి.మీ కురిసింది. తొండంగి మండ లంలో 145.28 మి.మీకు 182.06 మి.మీ కురిసింది..అదే ఈ నెల పది రోజుల జిల్లా సరాసరి వర్షపాతం తీసుకుంటే 51.16 మి.మీ. కు రవాల్సి ఉంటే 39.71 మి.మీ కురిసి లోటు కొనసాగుతోంది.
తూర్పున ఇలా...
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 మండలాలకు 14 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా ఐదు మండలాల్లో మాత్రం అదనపు వర్షపా తం నమో దైంది.చాగల్లు మండలంలో గడచిన 40 రో జుల్లో 155.61 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే 203.33, దేవరపల్లిలో 162.71కి 225.13, కొవ్వూరులో 166.3కు 213.56, నల్లజర్లలో 151.38కి 215.41, రాజమండ్రి అర్బ న్‌లో 173.64కి 208.69 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కోనసీమలో కలవరం..
కోనసీమ జిల్లాలో మొత్తం 22 మండలాలు ఉంటే ఏకంగా 15 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. గడచిన 40 రోజుల్లో అయినవిల్లి మండలంలో 188.5 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే 123.14 మాత్రమే కురిసింది.అల్లవరం 182.85కు 131.51, అమ లాపురం 187.65కు 128.54 మి.మీ,అంబాజీపేట 183.81కి 131.12, ఐ.పోలవరం 165.57కు 119.03, కాట్రేనికోన 177.89కి 120.36, మామిడికుదురు 181.27కి 134.3, ముమ్మిడివరం 188.42కి 120.72, పి.గన్నవరం 183.9కి 134.84,పామర్రు 156.26కి 119.78, రామచం ద్రపురం 153.69కి 120.7, రాయ వరం 166.61కి 123.9, రాజోలు 191.98కి 139.97, సఖినేటిపల్లి 208.17కు 144.04,ఉప్పలగుప్తం 172.93కు 124.86 మి.మీ. వర్షపాతమే నమోదైంది.కోనసీమలోనే లోటు అధికంగా ఉంది.
అప్పుడే నయం..
మే నెలలో కాకినాడ జిల్లా అంతా కలిపి 109.77 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే 115.48 మి.మీ. నమో దైంది. జూన్‌నెలలో 96.57 మి.మీలకు 120.75 మి.మీ. నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో మేలో 78.56 మి.మీ.కు 136.54 కురవగా, జూన్‌లో 107.77 మి.మీకు 145.27 మి.మీ. కురిసింది. కోనసీమ జిల్లాలో మేలో 72.55 మి.మీకు 130.88 మి.మీ. కురవగా, జూన్‌లో 102.37 మి.మీ వర్షపాతానికి 108.25 మి.మీ కురిసింది. 2024లో జూన్ నెలలో కాకినాడ జిల్లాలో 112.8 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే .210.2 మి.మీ కురిసింది.. కోనసీమలో 111.4కి 175.3 మి.మీ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో 117.0కి 198.3 కురిసింది. గతేడాది జూలైలో కాకినాడ జిల్లా 198.0 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే 223.8 మి.మీ. కురిసింది. కోనసీమలో 241కి 339.9 మి.మీ, తూర్పుగోదావరి జిల్లాలో 247.1కు 374.7 మి.మీ. కురిసింది. కానీ ఈ ఏడాది జూలైలో మాత్రం మొత్తం లోటు వర్షపాతం కొనసాగుతోంది.
గతేడాది వద్దంటే వానలు..ఇప్పుడేమో..?
జూలైలో ఈ పది రోజులు పరిశీలిస్తే ఒకటీ రెండు మండలాలు మినహా ఉమ్మడి జిల్లాలో అన్నీ లోటు వర్షపాతం కిందే రెడ్ మార్కులోకి వెళ్లిపోయాయి. సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే సూచీలు హె చ్చరిస్తున్నాయి. గడచిన 40 రోజుల వర్షపాతం లెక్క లు పరిశీలిస్తే వర్షాభావం తీవ్రత చాటుతోంది. అనేక మండలాల్లో అసలు చినుకు జాడలేదు. జిల్లాల వారీ గా పరిశీలిస్తే గత నెల జూన్ 1 నుంచి ఈ నెల 10 వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 147.58 మి.మీ.లకు 160.48 మి.మీ. కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 178.11 మి.మీలకు 192.28 మి.మీ. నమోదైంది. దీంతో ఈ రెండు జిల్లాలు సాధా రణ వర్షపాతం జాబితాలో కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లాలో 174.33 మి.మీలకు కేవలం 132.24 మి.మీ. కురిసింది. దీంతో జిల్లా లోటు వర్షపాతం జాబితాలో ఉంది. జిల్లాల సరాసరి వర్షపాతం సాధా రణంగా ఉండగా.. మండలాల వారీ పరిశీలిస్తే వర్షా భావ తీవ్రత కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో కొన్ని మండలాల్లో ఏకంగా అదనపు వర్ష పాతం నమోదవడం విశేషం.
Updated Date - Jul 12 , 2025 | 12:54 AM