ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయుర్‌వేదన!

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:22 AM

మందుల్లేని ఆసుపత్రి ఉంటుందా..ఎందుకు ఉం డ దు..రాజమహేంద్రవరంలో ఒక ఆసుపత్రి ఉంది.. ప్రైవే టు ఆసుపత్రి కాదండోయ్‌.. ప్రభుత్వ ఆసుపత్రే.. అయినా అధికారులకు పట్టదు..

ఆయుర్వేద విభాగం

ఏళ్ల తరబడి ఇంతే

రోగుల ఇక్కట్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మందుల్లేని ఆసుపత్రి ఉంటుందా..ఎందుకు ఉం డ దు..రాజమహేంద్రవరంలో ఒక ఆసుపత్రి ఉంది.. ప్రైవే టు ఆసుపత్రి కాదండోయ్‌.. ప్రభుత్వ ఆసుపత్రే.. అయినా అధికారులకు పట్టదు..ప్రాంతీయ ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ఆయు ర్వేద విభాగానికి కాయ కల్ప చికిత్స తక్షణ అవసరంగా కనిపిస్తోం ది. ఏళ్ల తరబడి మందుల్లేవు.ఇండెంట్లు పెట్టడం.. వేచి చూడడం పరిపాటిగా మారిపోయింది.దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నా రు. ప్రస్తుతం ఆయుర్వేదం,హోమియో వైద్యానికి ఆదరణ పెరు గుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఇస్తోంది. కానీ ఈఎస్‌ఐ ప్రాంతీయ ఆస్పత్రిలోని పరిస్థితిని చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆయుర్వేద వైద్య విభాగానికి ఒక సీనియర్‌ డాక్టరు మెడికల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. రోజుకు సుమారు 15 మంది రోగులు వైద్యానికి వస్తుంటారు. మందుల్లేకపోవడంతో రోగులకు సర్దిచెప్పి పంపడం తప్ప చేసేదేమీ ఉండడం లేదు.ఈ ఏరియా ఆస్పత్రిలో 2012లో ఆయుర్వేద విభాగాన్ని ఏర్పాటు చేశా రు. అప్ప ట్లో కావాల్సిన మందులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌) యాప్‌లో నమోదు చేస్తే వాటిని ఆస్పత్రికి సరఫరా చేయడం జరి గేది.తర్వాత 2022 నుంచి మందుల సరఫరా నిలిచి పోయింది.యాప్‌ మారడంతో చిక్కులు వచ్చా యి. ఆయుర్వేద మందుల కంపెనీలు కొత్త యాప్‌లో లేకపోవడంతో చేసేదేమీ లేక పోతోంది.ఎట్టకేలకు 120 రకాల ఔషఽఽ దాలను యాప్‌లో పెట్టారు. వీటి కోసం గత సెప్టెంబరు నుంచి ఆస్పత్రి వైద్యు లు ఇండెంట్‌ పెడుతూనే ఉన్నారు. ఈ రోజు వరకూ ఒక్క మందు బిళ్ల కూడా రాలేదు.ఇండెంట్‌ పెట్టిన తర్వాత 77 రోజుల వరకూ మళ్లీ ఇండెంట్‌ పెట్టడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో ఏళ్లు గడుస్తున్నా ఆయుర్వే వైద్య విభాగం పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదు.ఆయుర్వేద మందులు ఖరీ దైనవి.ఈఎస్‌ఐ అంటే చిన్నస్థాయి కార్మికులు వైద్యం కోసం వస్తుంటారు.అంత సొమ్ములు వెచ్చించి కొనుక్కొనే పరిస్థితి ఉండదు.కానీ తప్పని పరిస్థితుల్లో బయటే కొనుక్కుంటున్నారు. ఏళ్ల తరబడి మందులు లేకపోయినా పట్టించుకునే వారే లేరా? అని రోగులు ప్రశ్నిస్తున్నారు.మూడు నెలల కిందట కార్మిక మంత్రి సు భాష్‌ ఈ ఆస్పత్రిపై తీవ్ర చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదుగురు డాక్టర్లతో కలిపి 9 మందిని ఇంటికి పంపేశా రు.కానీ మందుల విషయం మాత్రం పట్టించుకోలేదు.దీంతో ఉచి తంగా వైద్యం పొందే హక్కు ఉన్న ఈఎస్‌ఐ సభ్యులకు ఖర్చు తప్ప డం లేదు.ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఆయుర్వేద వైద్యాన్ని గాడిలో పెట్టడంపై దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:23 AM