ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గూడు..గోడు!

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:06 AM

పేదలకు గూడు గోడు తప్పడంలేదు.. ప్రభుత్వ సాయం సక్రమంగా అందక ఇబ్బం దులు పడుతున్నారు.

అసంపూర్తి ఇంటి ఎదుట బాధితురాలు

ఇంకనూ పూర్తికాని లాగిన్‌

బిల్లులందక నీరసం

అసంపూర్తిగా నిర్మాణాలు

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

పేదలకు గూడు గోడు తప్పడంలేదు.. ప్రభుత్వ సాయం సక్రమంగా అందక ఇబ్బం దులు పడుతున్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.2.5 లక్షల రుణం ఇస్తా మని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని హౌసింగ్‌ అధికారుల అనుమతితో అనేక మం ది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌ రెండో తేదీన చాలా మందికి శాంక్షన్‌ ఆర్డర్లు వచ్చాయి. కొందరు బేస్‌మెంట్‌ వరకూ నిర్మించగా..కొందరు శ్లాబ్‌ వేసుకున్నారు. వాటి ని ఫోటోలు తీసి హౌసింగ్‌ అఽధికారులు తమ యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ లాగిన్‌ ఇంకా ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం అనేక ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అప్పోసప్పో చేసి పూర్తిగా నిర్మిస్తే లోన్‌ వస్తుందోలేదోననే భ యం లబ్ధిదారుల్లో ఉంది. అధికారులు మాత్రం కొన్ని చోట్ల గోడలు కట్టకుండా మిగతా పను లు పూర్తి చేసుకోమని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1595 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఆన్‌లైన్‌ చేశారు. వారిలో చాలా మం దికి శాంక్షన్‌ ఆర్డర్లు వచ్చాయి.ఇంకా కొన్ని ఆన్‌లైన్‌ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. ఇక ప్రభుత్వం లాగిన్‌ ఇస్తే బిల్లులు కూడా పడ తాయి. అనపర్తిలో 19, బిక్కవోలులో 51, చాగ ల్లులో 35, గోపాలపురంలో 56, కడియంలో 76, కోరుకొండలో 94, కొవ్వూరు అర్బన్‌లో 172, నిడదవోలు రూరల్‌లో 17, నిడదవోలు అర్బన్‌లో 120, పెరవలిలో 20, రాజమండ్రి అర్బన్‌లో 465, రాజమండ్రి రూరల్‌లో 96, రాజానగరంలో 139, రంగంపేటలో 87, సీతానగ రంలో 28, ఉండ్రాజవరంలో 97 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకో వడానికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:06 AM