భూ..కేర్ ఫుల్!
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:58 AM
ఖాళీ జాగా కనబడితే చాలు.. అది ప్రభుత్వా నిదా?.. ప్రైవేటుదా?..అనే విషయం అసలు పట్టించుకోరు.. ఆక్రమించేస్తారు.. ఠక్కున లింక్ డాక్యుమెంట్లు పుట్టిస్తారు.
భూ అక్రమాలకు చెల్లు
కలెక్టర్ చేతిలో పాశుపతాస్త్రం
కొత్త చట్టంతో రద్దుకు అవకాశం
1908 నాటి చట్టానికి సవరణ
అసెంబ్లీలో ఆమోదించిన సర్కార్
కోర్టుకెళ్లకుండానే పరిష్కారం
భూ బాధితులకు శుభవార్త
కబ్జాదారులకు చేదువార్త
నాటి అక్రమాలతో మేలుకొలుపు
(ఆంధ్రజ్యోతి-రాజమహేంద్రవరం)
ఖాళీ జాగా కనబడితే చాలు.. అది ప్రభుత్వా నిదా?.. ప్రైవేటుదా?..అనే విషయం అసలు పట్టించుకోరు.. ఆక్రమించేస్తారు.. ఠక్కున లింక్ డాక్యుమెంట్లు పుట్టిస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డబ్బుల కట్టలు విసిరి ఆ భూమిని చుట్టబెట్టేస్తారు. బాధితులు లబోదిబోమన్నా కదలరు వదలరు.. గత ప్రభుత్వంలో కబ్జా అనేది ఒక వృత్తిగా అవతరించింది. జడ్జి రామకృష్ణ భూములు ఒక వైసీపీ నాయకుడు ఆక్రమించారని గగ్గోలు పెట్టినా ఏం చేయలేని పరిస్థితి. నాడు ఇలా ఎందరో బాధితులు తమ భూములు ఆక్రమించారని పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కిన వారున్నారు.. అయినా లాభం లేకపోయింది.. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించిందో ఏమో కానీ.. భూ అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
భూ అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషను రద్దు అధికారం పౌర న్యాయస్థానాలకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ అధికారం కలెక్టర్‌కి దాఖలు పరు స్తూ చట్టం అమల్లోకి వచ్చింది. ఆస్తుల రిజి స్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీకి దాఖలు పరుస్తూ 1908 నాటి చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది. శాసన సభ ఆమోదిం చిన సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెల పడంతో ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చేసింది. వాస్తవానికి భూముల క్రయ, విక్రయాల సమ యంలో సబ్- రిజిస్ట్రార్లు ఆ భూమి/స్థలానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిం చాలి. ఒక వేళ ప్రభుత్వానికి చెందిన లేదా నిషేఽ దిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల వివరా లను రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ల శాఖకు అంద జేస్తుంది. ఆ జాబితాలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషను చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ భూములను కాపాడడంలో కలెక్టర్‌కి ఎంత బాధ్యత ఉంటుందో.. సబ్-రిజిస్ట్రార్లకూ అంతే ఉంటుంది. అది వారి విధి కూడా. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రుజువైతే సబ్- రిజిస్ట్రారుకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశాన్ని చట్టం కల్పి స్తోంది.కానీ చట్టాల్లో ఉన్న లొసుగులు, కోర్టుల్లో ఏళ్లకు తరబడి విచారణ నడవడం వంటి కార ణాలతో వాళ్లకు భయం, బాధ్యత పోయాయి. వాస్తవానికి మోళీ తతంగానికి సబ్-రిజిస్ట్రారు కార్యాలయమే కేంద్ర బిందువుగా ఉంటుంది. చట్టాలు ఉన్నా ఇప్పటి వరకూ యథేచ్చగా భూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి.
ఫ్రీ హోల్డ్ పేరుతో..
22(ఎ) జాబితాలో ఉన్న భూములను కబ్జా దారులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించు కుంటూనే ఉన్నారు. వాస్తవానికి నిషేధిత భూ ముల జాబితా ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో గ్రామా లు, సర్వేల వారీగా ఉంటుంది. కానీ దానిపై పెద్దగా అవగాహన లేక ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమణదారులు చేజిక్కించుకుం టున్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం అడిన ఫ్రీహోల్డు నాటకం భూ పందేరానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. నిషేధిత జాబితాలో ఉన్న కొన్ని భూములను, చుక్కల భూములను అప్పట్లో జాబితా నుంచి తొలగించారు. దీనినే ఫ్రీహోల్డు అంటారు. దీంతో వీటికి రిజిస్ట్రేషను చేయించు కొనే వెసులుబాటు కలిగింది. అంతే.. వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో వందలాది ఎకరాలు చుట్ట బెట్టేశారు. ఎంతలా అంటే అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ల అధికారుల లెక్కలకు పొంతన కుద రనంతగా నొక్కేశారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో 5120 ఎకరాలను ఫ్రీహోల్డు చేశారు. వీటిలో 47 లావాదేవీల ద్వారా 41.866 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని జిల్లా రిజిస్ట్రారు కార్యాలయ రికార్డులు చెబుతుంటే.. 100 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని కలెక్టరేట్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంతో ఫ్రీహోల్డును సెట్‌చేసే పనిని కూడా ప్రభుత్వం మొదలు పెట్టనుంది.
కొత్త చట్టం ఏం చెబుతుందంటే..
కొత్తగా వచ్చిన చట్టంతో ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పడుతుంది. జిల్లా కలెక్టరు చైర్మన్‌గా ఉంటే, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ తదితర శా ఖల నుంచి ఇతర సభ్యులు ఉంటారు. అక్ర మంగా రిజిస్ట్రేషను జరిగిందని కలెక్టర్‌కి ఫిర్యాదు అందిన తర్వాత కమిటీ రంగంలోకి దిగుతుంది. రిజిస్ట్రేషను అక్రమమని తేలితే రద్దు చేస్తారు. ఇప్పటి వరకూ ఈ అధికారం క్రయ విక్రయదారులిద్దరూ కలిపి లేదా సివిల్ కోర్టుల చేతుల్లోనే ఉండేది. కొత్తగా వచ్చిన చట్టంతో ఖర్చు, సమయం కూడా ఆదా అవు తుందని చెబుతున్నారు. విధి విధానాలు తమకు ఇంకా రాలేదని తూర్పు గోదావరి జిల్లా రిజిస్ట్రారు సత్యనారాయణ తెలిపారు.
Updated Date - Jul 14 , 2025 | 12:58 AM