పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదం
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:22 AM
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రి సుభాష్ అన్నారు.
ద్రాక్షారామ, జూలై 8(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రి సుభాష్ అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో బంగారు చెరువు చెట్టు వద్ద 200 కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ హరీష్‌మాధుర్‌తో కలసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఉపకరిస్తాయన్నారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్ పథకం అనుసంధానంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ సత్యనారాయణ, ఏపీవో గణపతి, ఎంపీడీవో కడలి పద్మజ్యోతి, జేఈ ఈశ్వరరావు, ఎంపీటీిసీ చిక్కాల స్వామికాపు, పలువురు కూటమి నాయకులు తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:22 AM