ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకం
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:47 AM
ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని స్థానిక సర్పంచ్ గంటి విజయభారతి అన్నా రు.
ఆత్రేయపురం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని స్థానిక సర్పంచ్ గంటి విజయభారతి అన్నా రు. బుధవారం పేరవరంలో ప్రకృతి వ్యవసాయ సాగుపై గ్రామసభ నిర్వహించారు. నవధాన్యాలు, పంట పొలాల్లో వేసుకోవడం ద్వారా సూక్ష్మపోషకాలు వృద్ధి చెందుతాయన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ద్వారా ఆరోగ్యం కలుగుతుందన్నారు. నవధాన్యాల సాగు చేపట్టాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గంటి నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కస్తూరి, అన్నపూర్ణ, వీరబాబు, ఝాన్సీ, మార్తమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:47 AM