తప్పిన పెను ప్రమాదం
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:59 AM
ముమ్మిడివరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మి డివరం మండలం దొమ్మేటిపారివాలెం వద్ద పె ను ప్రమాదం తప్పింది. నాఫ్తాను తీసుకెళ్తూ బోల్తా కొట్టిన ఓఎన్జీసీ ట్యాంకర్‌ను శుక్రవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో పైకి లేపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాటిపాక ఓఎన్జీసీ
బోల్తా కొట్టిన నాఫ్తా ట్యాంకర్‌ను సురక్షితంగా పైకి తీసిన ఓఎన్జీసీ సిబ్బంది
ముమ్మిడివరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మి డివరం మండలం దొమ్మేటిపారివాలెం వద్ద పె ను ప్రమాదం తప్పింది. నాఫ్తాను తీసుకెళ్తూ బోల్తా కొట్టిన ఓఎన్జీసీ ట్యాంకర్‌ను శుక్రవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో పైకి లేపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాటిపాక ఓఎన్జీసీ సైట్ నుంచి సుమారు 29వేల లీటర్ల నాఫ్తా చెన్నైకు తీసుకెళ్తుండగా ముమ్మిడివరం నగర పంచాయతీ బైపాస్ రోడ్డులోని దొమ్మేటిపారివాలెం వద్ద గురువారం అర్ధరాత్రి అదుపు తప్పి బోల్తా కొట్టింది. వెంటనే ముమ్మిడివరం ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్ ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడ ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ను ముమ్మిడివరం మీదుగా మళ్లించి ఘటనా స్థలానికి వంద మీటర్ల మేర ప్రజల్ని ఖాళీ చేయించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 2 అంబులెన్సులు ముమ్మిడివరం, అమలాపురం ఫైర్ ఇంజన్లతో పాటు ఓఎన్జీసీకి చెందిన మరో 2 ఫైర్ ఇంజన్లు, 4 క్రేన్‌లను సిద్ధం చేశారు. ఓఎన్జీసీ సెక్యూరిటీ ఆఫీసర్ బలరామ్ సిబ్బందితో చేరుకుని ట్యాంకర్ క్యాప్ నుంచి లీకవుతున్న నాఫ్తాను అదుపుచేసి ట్యాంకర్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. చిన్న క్రేన్లతో సాధ్యకాకపోవడంతో భారీ క్రేన్‌ను తీసుకువచ్చి ఫోమ్ పిచికారీ చేస్తూ 3 గంటల పాటు శ్రమించి ఉదయం 7.30 గంటల సమయంలో పైకి లేపారు. ట్యాంకర్ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ట్యాంకర్‌లో ఉన్న నాఫ్తా సుమారు 2వేల లీటర్లు నేల పాలు అయింది. నాఫ్తా గాలిలో కలిసి వెంటనే ఫైర్ అయ్యే స్వభావం ఉంది. దీంతో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించి అటుగా వాహనాల రాకపోకలు సాగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయించారు. ఫైర్, ఓఎన్జీసీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి ట్యాంకర్‌ను సురక్షితంగా పైకి లేపారు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బోల్తా కొట్టిన ట్యాంకర్‌కు మరమ్మతులు చేసి అక్కడినుంచి తరలించారు.
Updated Date - Aug 02 , 2025 | 12:59 AM