ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హత్య చేసి.. హైవే పక్కన పడేసి..

ABN, Publish Date - May 04 , 2025 | 01:31 AM

గొల్లప్రోలు, మే 3(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య తన ప్రియుడు, స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని జిల్లా దాటించి 75 కిలోమీటర్ల దూరంలో పడవేశారు. తమ గు ట్టు బయటపడలేదని భావించారు. కానీ, మృ తుడి తల్లి ఫిర్యాదు, సాంకేతిక

గొల్లప్రోలులో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌

భర్త హత్య కేసులో భార్య సహా ముగ్గురి అరెస్టు

వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ

గొల్లప్రోలు, మే 3(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య తన ప్రియుడు, స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని జిల్లా దాటించి 75 కిలోమీటర్ల దూరంలో పడవేశారు. తమ గు ట్టు బయటపడలేదని భావించారు. కానీ, మృ తుడి తల్లి ఫిర్యాదు, సాంకేతికత అంశాల ఆధా రంగా పోలీసుల దర్యాప్తుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి భార్యతో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌లో కాకినాడ ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో ఈ వివరాలను ఎస్పీ వెల్లడించారు.

మృతదేహం గుర్తింపుతో దర్యాప్తు

కాకినాడ జిల్లా పరిధిలోని కత్తిపూడి-కాకినాడ మధ్యగల 216వ జాతీయ రహదారిపై గొల్లప్రో లు మండలం చేబ్రోలు బైపాస్‌రోడ్డులో మార్చి 3న గుర్తు తెలియని వ్యక్తి 35-40ఏళ్ల మృతదేహం గాయాలతో కుళ్లిన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. చేబ్రోలు వీఆర్వో ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి ఎస్పీ, ఏఎస్పీ ఆధ్వర్యంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, సర్కిల్‌ ఎస్‌ఐలు, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్ప డి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ట్రాల మిస్సింగ్‌ కేసులు, జాతీయ రహదారిపై సీసీ కెమేరాలు, టోల్‌ప్లాజాల వద్ద సీసీ ఫుటేజీ లు, సెల్‌టవర్‌ ఆధారంగా విచారణ సాగించా రు. దర్యాప్తు సాగుతున్న సమయంలో అనకాప ల్లి జిల్లా యలమంచిలి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏప్రిల్‌ 28న తన కుమారుడు రెండునెలలుగా కనిపించడంలేదని తల్లి చేసిన ఫిర్యాదుపై మిస్సి ంగ్‌ కేసు నమోదైంది. దీనిపై పరిశీలన జరపగా మృతదేహం యలమంచిలి పట్టణం ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజుగా గుర్తించారు. లోవరాజు భార్య శ్యామలకు భర్త బంధు వైన మాడెం మోహన్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీన్ని కొనసాగించడానికి భర్త అడ్డంకిగా ఉన్నాడని వారిద్దరూ భావించారు. దీంతో మోహనకుమార్‌, అతడి స్నేహితుడు బల్లా గంగాధరరావు కలిసి ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి లోవరాజును హత్య చేసి చేబ్రోలు హైవే పక్కన పడవేశారు. 75 కిలోమీటర్ల దూరంలో జిల్లాను దాటి మృతదేహాన్ని ఇక్కడ పడవేయడం, రెండు నెలల వ్యవధిలో తమపై ఎవరికీ అనుమానం రాలేదని నిందితులు భావించారు. కుమారుడు కనిపించకపోవడం, కోడలి ప్రవర్తనపై అనుమానంరావడంతో మృతుడి తల్లి య లమంచలి పోలీసులను ఆశ్రయించింది. దీని ఆధారంగా దర్యాప్తు జరపడంతో కేసు కొలిక్కి వచ్చినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ వివరించారు. భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని తరలించేందుకు వినియోగించిన మారుతి ఎర్టిగా కారును సీజ్‌ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్‌.రామకృష్ణ, ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులను అభినందించారు.

Updated Date - May 04 , 2025 | 01:31 AM