ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపటి నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె

ABN, Publish Date - Jul 15 , 2025 | 01:22 AM

డిమాండ్ల సాధనకు మునిసిపల్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.

కొవ్వూరు మునిసిపల్‌ కమిషనర్‌ సందీప్‌కు సమ్మెనోటీసు అందిస్తున్న కార్మికులు

కొవ్వూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : డిమాండ్ల సాధనకు మునిసిపల్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఏపీ మునిసిపల్‌ వర్క ర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కొవ్వూరు మునిసిపల్‌ కమిషనర్‌ సందీప్‌కు పారిశుధ్య కార్మికు లు సమ్మె నోటీసు అందించారు. కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ఆప్కాస్‌ స్థానంలో ప్రైవేటు ఏజెన్సీలకు అధికారం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉపసంహరించాలన్నారు. పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, వయో పరిమితి 62 ఏళ్లకు పెంచాలని, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఎక్స్‌గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలకు పెం చాలని, దహన సంస్కరాలకు రూ. 20 వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు జీవో నంబరు 26 ప్రకారం ఆదాయపరిమితితో సంబంధం లేకుండా పథకం వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ కొవ్వూరు పురపాలక సంఘంలో అమలు కాలేదన్నారు.లోపాలను సరిదిద్ది తక్షణం తల్లికి వందనం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 16 నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె చేపడుతున్నట్టు నోటీసు అందించారు.కార్యక్రమంలో ఎం.సుందరబాబు, భూపతి రవీంద్ర, పి.వాసు, కళ్యాణి రాజేష్‌, రాజాన అప్పారావు, ఎం.కిషోర్‌, మీసాల జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 01:23 AM