ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:25 AM

ఎవరైనా బీజేపీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు లోబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

వృత్తి నిపుణుల సదస్సులో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి

వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యం

కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైన్‌ ఓకే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ఎవరైనా బీజేపీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు లోబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డులోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సోమవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడా రు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రా జెక్టు, రాజధాని అమరావతి పనుల్లో కదలిక మొదలైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ స్వప్నానికి వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ భాగం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అమరావతి రాజధాని కోసం ప్రపంచబ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అసత్యమన్నారు. లాభాల్లోకి తేవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌత్‌కోస్టల్‌ రైల్వే డివిజన్‌ వైజాగ్‌ హబ్‌గా త్వరలో ఏర్పాటు కానుందన్నారు. భద్రాచలం-కొవ్వూరు 151 కిలోమీటర్ల రైల్వేలైను ఇప్పటికే మంజూరైందని, దువ్వాడ - రాజమహేంద్రవరం రైల్వే లైను డబ్లింగ్‌ చేపట్టడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి కాశీ, బెనారస్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారన్నారు. ప్రస్తుతం తాను కామన్వెల్త్‌ ఉమెన్‌ పార్లమెంట్‌ ఇండియన్‌ ఛాప్టర్‌కు చైర్మన్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్నానని వెల్లడించారు. ఇటు రాజమహేంద్ర వరం పార్లమెంట్‌ చూసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ బాధ్య తలు కూడా నిర్వర్తిస్తున్నానన్నారు. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ పాలన చేస్తున్నారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మన జవాన్ల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని సీఎం చంద్రబాబు అ ందిపుచ్చుకున్నారన్నారు.సమావేశంలో జీఎస్‌ఎల్‌ హాస్పటల్స్‌ అధినేత డాక్టర్‌ గన్ని భాస్కరరావు, సాయి హాస్పటల్స్‌ అధినేత కె.విజయకుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, జిల్లా ఇన్‌చార్జి భగవాన్‌,నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, కంటిపూడి సర్వారాయుడు,నర్సిపల్లి హారిక, వీరా వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:25 AM