జ..గన్..మిథున్!
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:19 AM
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరాచకాలు, అక్ర మాలకు, దందాలకు లెక్కేలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్‌గా అధికారం చెలాయించారు.
కన్నేస్తే ఖాళీ కావాల్సిందే
నాడు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్
ఐదేళ్లూ దందాలు.. దౌర్జన్యాలే
ఎన్నికల్లో మద్యం, డబ్బు డంపింగ్
నకిలీ మద్యం నిల్వలు
లేటరైట్.. అక్రమాలు
పేదల ఇళ్ల స్థలాల చదును
కేబీకే బయోటెక్‌లో హస్తం
లిక్కర్ స్కాంలో జైలుపాలు
మిథున్‌రెడ్డి అరాచకాలెన్నెన్నో..
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరాచకాలు, అక్ర మాలకు, దందాలకు లెక్కేలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్‌గా అధికారం చెలాయించారు. వంతాడ మైనింగ్‌పై కన్నేసి లీజుదారులను బెది రించి వాటాలు కొట్టేశారు. అప్పటి సీఎం జగన్ భారతి సిమెంట్ కంపెనీకి ఇక్కడి నుంచి రిజర్వ్ ఫారెస్ట్‌ను తవ్వేసి మరీ లేటరైట్ పంపించారు. జగన్ కోసం కాకినాడ పోర్టు,కాకినాడ సెజ్ య జమానులను బెదిరించి వాటాలను అరబిందో కంపెనీకి రాయించడం కోసం ఏకంగా బెదిరిం పులకు దిగారు. వందలకోట్ల పేదల ఇళ్ల స్థలాల చదునులో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిపి కోట్లకు కోట్లు కొట్టేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం కుంభకోణంలో సంపాదించిన అక్రమ సొమ్మునే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవ ర్గాలకు తరలించి టీడీపీని ఓడించడానికి మిథు న్‌రెడ్డి స్కెచ్ అమలుచేశారు. అప్పటి సీఎం జగన్ అండదండలతో ఉమ్మడి జిల్లాలో మిథున్ రెడ్డి రెచ్చిపోయారు. రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాతో మిథున్‌రెడ్డికి సంబంధం?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో కడప జిల్లా రాజంపేట ఎంపీగా ఉన్న పీవీ మిథున్‌రెడ్డిని అప్పటి సీఎం జగన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్‌గా నియమించారు. అప్పటి నుంచీ మిథున్‌రెడ్డి జిల్లాలో చెలరేగిపోయారు. జగన్ మెప్పుకోసం.. జగన్ ఆర్థిక ప్రయోజనాల కోసం అడ్డంగా బరి తెగించేశారు. కలెక్టర్లు, ఎస్పీలుగా ఎవరుండాలో ఆయనే డిసైడ్ చేసేవారు. అయితే అప్పటికే జగన్ ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీలో మిథున్‌రెడ్డి కీలకంగా మారారు. మద్యం ముడుపులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి? ఏబ్రాండ్‌లను అనుమతించాలి? వంటివన్నీ మిథున్‌రెడ్డి చక్కబెట్టారు. పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ నుంచి స్పిరిట్ కొనుగోలులోనూ చక్రం తిప్పినట్టు సమాచారం. ప్రభుత్వం మారాక గతేడాది మద్యం కుంభకోణానికి సంబంధించి సీఐడీ జరిపిన సోదాల్లో చినబ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ కంపెనీ కూడా ఉంది. డిస్టీలరీల లెక్కలు, కేబీకే నుంచి వెళ్లిన సరుకు లెక్కల్లో వ్యత్యాసాలపై ఆరా తీసింది. తాజాగా ఈ కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర బయటపడడంతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుపాలయ్యారు.
రిజర్వ్ ఫారెస్ట్ తవ్వించేశారు...
విశాఖ జిల్లా నాతవరం మండలం బమిడికిలొద్దు వద్ద లేటరైట్ కొండలపై జగన్ కన్ను పడింది. లీజుదారుడిని దారికితెచ్చుకుని మిథున్ రెడ్డి వాలిపోయారు. తవ్విన లేటరైట్‌ను జాతీయరహదారి మీదుగా కడపలోని సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించే దగ్గర చిక్కొచ్చింది. దీంతో మిథున్‌రెడ్డి పెద్ద స్కెచ్ వేశారు. బమిడికలొద్దు లేటరైట్ క్వారీకి అతి సమీపంలో రౌతులపూడి ఉండడంతో క్వారీ నుంచి జల్దాం వరకు రహదారిని నిర్మించి అక్కడి నుంచి కత్తిపూడి హైవే మీదుగా కడపకు లేటరైట్ తరలింపునకు స్కెచ్ వేశారు. ఈ మేరకు చెల్లూరు-బమిడికలొద్దు మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్‌ను అటవీశాఖ అ నుమతుల్లేకుం డా తవ్విపారే శారు. ఇక్కడి నుంచి కడపలో భారతి సిమెం ట్‌కు లేటరైట్ తరలించేశారు.
సెజ్‌లు..పోర్టు..
పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకినాడ సెజ్ దేశంలోనే పెద్దది. ఇందులో 51 శాతం జీఎమ్మార్, కాకినాడ డీప్ వాటర్‌పోర్టు నిర్వహణదారుడైన కేవీరావుకు 0.29 శాతం, ఆయనకే చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రై వేట్ లిమిటెడ్(కేఐహెచ్‌పీఎల్)కు 33.75 శాతం వాటాలున్నాయి. వీటన్నింటిపై జగన్ కన్నేయగా, మిథున్‌రెడ్డి రంగంలోకి దిగి వైవీ.విక్రాంత్‌రెడ్డితో కలిపి స్కెచ్ వేశారు. కేవీ రావును బెదిరించి వాటా రాయించేసుకున్నారు. కాకినాడ సీపోర్టు(డీప్‌వాటర్‌పోర్టు)పైనా జగన్ కన్నేయడంతో మిథున్‌రెడ్డి బెదిరించి 41.12శాతం వాటాను కేవీ రావు జగన్ చెప్పిన అరబిందోకు విక్రయించారు.
బెదిరించి..వాటాలు కొట్టేసి..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వం తాడ కొండల్లో లేటరైట్ సిమెంట్ తయారీ, అ ల్యూమినియం ఉత్పత్తికి ఆధారం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆండ్రు శ్రీనివాస్ 2013లో వంతాడ కొండపై 20 ఏళ్ల పాటు 200 ఎకరాల్లో లీజులు దక్కించుకున్నా రు. 41.25 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్ గను లపై జగన్ ఆదేశాలతో మిథున్‌రెడ్డి కన్నేశారు. లీజుదారుడిని బెదిరించి బలవంతంగా డీల్ కు దిర్చారు. దీని ద్వారా ఏడాదికి అప్పటి ప్రభుత్వ పెద్దలు రూ.180 కోట్లు వెనకేసుకున్నారు.
ఎన్నికల్లో.. డబ్బు..మందు...
ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ హోదాలో మిథున్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి మద్యం, అక్రమ సొమ్ము వందల కోట్లలో ఇక్కడ డంప్ చేశారు. ఈమేరకు అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడితో స్కెచ్ వేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి మిథున్‌రెడ్డి కొన్ని రోజు లు జిల్లాలోనే మకాం వేశారు. కడప నుంచి నకిలీ మద్యాన్ని వ్యాన్లలో తరలించారు. ఒక్క పిఠాపురానికి కోట్లలో నకిలీ మద్యం డంప్ చేశా రు. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలకు రూ.30 కోట్లు, కోట్ల విలువైన మద్యం మిథున్‌రెడ్డి కనుసన్నల్లోనే పంపిణీ జరిగింది. ఈ మందు పలుచోట్ల జిల్లాల్లో పట్టుబడింది. ఈ బాటిళ్లు అత్యంత నాసిరకంగా తేల్చారు.
సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్‌రెడ్డి
లిక్కర్‌స్కామ్‌లో ఏ4, వైసీపీ ఎంపీ పెదిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ నంబర్ 4196 కేటాయించారు. సెంట్రల్ సూపరింటెండెంట్ రాహుల్ కథనం ప్రకారం. ఆదివారం రాత్రి 8:50 గంటలకు నిందితుడిని జైలులోకి తీసుకున్నారు. అతన్ని స్నేహా బ్లాక్ బ్యారక్‌లో ఉంచారు.
Updated Date - Jul 22 , 2025 | 01:19 AM